E-Paper
Advertisement

Amaravati: జగన్ స్కెచ్ మామూలుగా లేదు.. మావిగన్ చుట్టూ ఏపీ రాజకీయాలు, అందుకే ఈ ప్లాన్

Amaravati: జగన్ స్కెచ్ మామూలుగా లేదు.. మావిగన్ చుట్టూ ఏపీ రాజకీయాలు, అందుకే ఈ ప్లాన్
Advertisement

Amaravati: ఏపీలో రాజకీయాలు క్రమంగా హీటెక్కుతున్నాయా? సరైన అస్త్రాల కోసం వైసీపీ వెయిట్ చేస్తోందా? ‘మావిగన్’ రూపంలో భారీ అస్త్రం ఆ పార్టీకి దొరికిందా? ఎందుకు దాన్ని భారీ ఎత్తున ప్రచారం చేస్తోంది? దీని వెనుక స్కెచ్ ఏంటి? వైసీపీ నేతలు ఏమంటున్నారు? ఈ స్టోరీపై ఓ లుక్కేద్దాం.

మావిగన్ చూట్టూ ఏపీ రాజకీయాలు.. జగన్ స్కెచ్ మామూలుగా లేదు

Advertisement

మావిగన్ రూపంలో వైసీపీకి సరైన అస్త్రం లభించింది. గడిచిన రెండేళ్లు ఆ పార్టీ నేతలు బయటకు వచ్చి పెద్దగా మాట్లాడిన సందర్భం లేదు. ఏ విషయాలు మాట్లాడినా అధికార పక్షం నుంచి వెంటనే కౌంటర్ల మీద కౌంటర్లు పడిపోతున్నాయి. దీన్ని నుంచి బయటకు రాలేక రెండేళ్లు తర్జనభర్జన పడ్డారు. అధినేత జగన్ ఎక్కుపెట్టిన మావిగన్ ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ డిసైడ్ అయినట్టు సమాచారం.

ఇందుకు కారణాలు లేకపోలేదు. ఏపీ రాజధాని అమరావతి కావడంతో క్రెడిట్ అంతా కూటమి ప్రభుత్వానికి పోతుంది. దీనివల్ల ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలో పెద్ద మైనస్.దీన్ని అధిగమించేందుకు జగన్ ఎక్కుపెట్టిన అస్త్రం ‘మావిగన్’. ఆ పేరులో మూడు ప్రాంతాలు కలిసి ఉండడంతో కచ్చితంగా రానున్న రోజుల్లో తమకు అనుకూలంగా మారవచ్చని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

Advertisement

తాడేపల్లి జగన్ ప్యాలెస్ చుట్టూ ‘మావిగన్’ బ్యానర్లు

అందుకోసం మావిగన్ గురించి ఎడతెగని ప్రచారం చేస్తోంది వైసీపీ. గడిచిన వారం రోజులుగా ఆ పార్టీ నేతలు మీడియా ముందుకొచ్చిన ప్రతీసారి మావిగన్ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కేవలం మీడియా ముందు నేతలు మాట్లాడితే సరిపోదని, దీనిపై ఊరూవాడా జోరుగా ప్రచారం చేయాలని నిర్ణయించుకుంది వైసీపీ.

ఈ నేపథ్యంలో తాడేపల్లిలో జగన్ ప్యాలెస్ చుట్టూ తాటికాయంత అక్షరాలతో ‘మావిగన్’ బ్యానర్లు వెలిశాయి. మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు కారిడార్‌ను రాజధానిగా అభివృద్ధి చేయాలని జగన్ ప్రతిపాదనకు మద్దతుగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.  రానున్న రోజుల్లో ఈ తరహా బ్యానర్లు సిద్ధం చేయాలని హైకమాండ్ నుంచి ఆ పార్టీ నేతలకు సంకేతాలు వెళ్లినట్టు చిన్నపాటి చర్చ అప్పుడే మొదలైంది.

ALSO READ: ఏపీలో వింత వాతావరణం.. ఒకచోట భానుడి భగభగలు.. మరోచోట వరుణుడి పలకరింపు!

తాము అమరావతికి వ్యతిరేకం కానదన్నది వైసీపీ ఆలోచన. ఆ రెండు జిల్లాల్లో పార్టీ పదిలంగానే ఉంటుందని ఓ అంచనా.  అందుకోసం ఈ స్కెచ్ వేసినట్టు ఆ పార్టీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. 2029 ఎన్నికల్లో కాకపోయినా 2034 ఎన్నికల్లో తప్పకుండా విజయం తమదేనని మాట్లాడుకుంటున్నారు.

దీనివల్ల జగన్ ఆలోచనను మద్దతు ఇచ్చినట్టు అవుతుందని,  అమరావతి రైతుల్లో కొత్త ఆందోళన ఉంటుందని అంటున్నారు. అంతేకాదు అమరాతికి పెట్టుబడులు కూడా రావన్నది కొందరు నేతలు చెప్పుకుంటున్నారు.  ఒక్క దెబ్బకు రెండు పిట్టలను జగన్ కొట్టడం వెనుక వ్యూహం ఇదేనని అంటున్నారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×