E-Paper
Advertisement

Jagan: పులివెందుల రిజల్ట్.. జగన్ కామెంట్స్ వెనుక

Jagan: పులివెందుల రిజల్ట్..  జగన్ కామెంట్స్ వెనుక
Advertisement

Jagan: వైసీపీకి సెకండ్ ఇయర్ కలిసిరావడం లేదా? పాలక పక్షం నుంచి ఇబ్బందులు పొంచి వున్నాయా? వచ్చే ఏడాది కూడా కంటిన్యూ అవుతాయా? జగన్ ట్వీట్ వెనుక అసలు మేటరేంటి? వైసీపీ చేసేది అంతా ధర్మంగా సాగుతుందని అంటున్నారా? అధికార పక్షం అధర్మంగా వెళ్తుందా? ఆయన మాటల వెనుక అర్థమేంటి?

కృష్ణాష్ట‌మి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్ష‌లు చెప్పారు మాజీ సీఎం జగన్. ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘అధర్మం ఎంత బలంగా ఉన్నా- అది తాత్కాలికం.. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా- అది శాశ్వతం’ అని రాసుకొచ్చారు. ‘శ్రీకృష్ణుని జీవితం అందరుకు నిదర్శనం’ అని రాసుకొచ్చారు.

Advertisement

కృష్ణాష్టమి సందర్భంగా శాంతి, ప్రేమ, విజయాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు రాసుకొచ్చారు. ఉన్నట్లు జగన్ మాటలకు అర్థం ఏంటంటూ ప్రత్యర్థుల నుంచి సెటైర్లు పడిపోతున్నాయి.  ఈ మధ్యకాలంలో ఏమైనా పండగలు వస్తే క్రమం తప్పకుండా ఎక్స్‌లో రాసుకొస్తున్నారు.

అధికార పక్షాన్ని ఎండగడుతూనే.. తాను ధర్మంగా ఉంటానని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.. చేశారు కూడా. పులివెందుల జెడ్పీ బైపోల్‌ ఫలితాలను దృష్టి పెట్టుకుని ఆ విధంగా కామెంట్స్ చేశారని అంటున్నారు. ఎందుకంటే పులివెందుల జెడ్పీ గెలుపు అధర్మంగా జరిగిందన్నది జగన్ మాట.  టీడీపీ నేతలు చేసిన ఈ పని తాత్కాలికమేనని, ధర్మం నెమ్మదిగా ఉంటుందని అంటున్నారు.

Advertisement

ALSO READ: తిరుమల శ్రీవాణి టికెట్ల విక్రయాల్లో గందరగోళం.. భక్తులు నిరసనలు 

ఈ లెక్కన పార్టీ పుంజుకునేందుకు జగన్ రకరకాల వ్యూహాలను అవలభిస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఏడాది చివరలో స్థానిక  సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి.  కడప జెడ్పీ, పులివెందుల మున్సిపాలిటీ చేజారకుండే ఉండేందుకు ప్లాన్ చేసినట్టు నేతల మాట.

నార్మల్‌‌గా ఓటమి.. విజయానికి తొలి మెట్టుగా చెబుతున్నారు. జగన్ కూడా ఆ విధంగా ఆలోచన చేస్తున్నారా? అన్నది అసలు పాయింట్. మొత్తానికి జగన్ ఎక్స్ వేదికగా చేసిన కామెంట్స్‌పై ఎవరికి నచ్చినట్టు వారు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పవచ్చు.

 

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×