E-Paper
Advertisement

Jagan going to Bangalore: జగన్ బెంగుళూరుకి వెళ్తున్నారా..? గాలితో మంతనాలు జరపటానికేనా..?

Jagan going to Bangalore: జగన్ బెంగుళూరుకి వెళ్తున్నారా..? గాలితో మంతనాలు జరపటానికేనా..?
Advertisement

YS Jagan going to Bangalore: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ గురించి ఆసక్తికరమైన వార్త ఒకటి వెలుగు లోకి వచ్చింది. ప్రస్తుతం పులివెందులలో ఉన్న ఆయన అక్కడి నుంచి నేరుగా బెంగుళూరు వెళ్లబోతున్న ట్లు తెలుస్తోంది. అంతేకాదు వీలు కుదిరితే బీజేపీ నేత గాలి జనార్థన్‌రెడ్డితో భేటీ అయ్యే ఛాన్స్ ఉందనేది అసలు సారాంశం.

శనివారం మధ్యాహ్నం తాడేపల్లి నుంచి పులివెందులకు వెళ్లారు వైసీపీ అధినేత జగన్. మాజీ సీఎం రాకతో కార్యకర్తలు, అభిమానులు, కాంట్రాక్టర్లు తరలివచ్చారు. కార్యకర్తలతో మాట్లాడి చెప్పాల్సిన నాలుగు ముక్క లు చెప్పి పంపించారు. రోజురోజుకూ నేతలు రావడంతో ఆయన బెంగుళూరు వెళ్లనున్నట్లు సమాచారం. ఇందుకు కారణాలు లేకపోలేదు. కొద్దిరోజులు ప్రశాంతతకు కోసం వస్తే.. అక్కడ కూడా కార్యకర్తలు రోజూ రావడంతో చివరకు బెంగుళూరుకు ప్లాన్ చేశారట.

Advertisement

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్‌కు సంబందించి వ్యాపారాలు జోరందుకున్నాయి. సిమెంట్, పవర్, జియో ఇలా పెట్టుబడులు పెట్టిన కంపెనీలన్నీ లాభాల బాట పట్టాయి. ప్రభుత్వం మారడంతో వాటిపై ప్రభావం పడుతుందని భావించి ఇకపై బిజినెస్‌పై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఫ్యామిలీ మిత్రుడు గాలి జనార్థన్‌రెడ్డితో సమావేశమయ్యే ఛాన్స్ ఉందని కడప నేతలు చెబుతున్నమాట.

Also Read:  కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు.. మెగా డీఎస్సీకి ఆమోదం..

Advertisement

లోక్‌సభ ఎన్నికల ముందు గాలి జనార్థన్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లారు. తన మిత్రుడు తరపున ప్రచారం చేశారాయన. ఏపీలో మారిన రాజకీయాల నేపథ్యంలో గాలి ద్వారా బీజేపీకి దగ్గరవ్వాలన్నది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. మరికొందరు మాత్రం కేసు విషయం గురించి మాట్లాడవచ్చని అంటున్నారు. మొత్తానికి జగన్ బెంగుళూరు వెళ్తారన్న వార్త రాజకీయ వర్గాల్లో మాత్రం హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది. దీనికి గురించి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×