E-Paper
Advertisement

Jagan: రేపు హైదరాబాద్‌కు జగన్.. కోర్టుకు వెళ్లకుండా, కొత్త ప్లాన్?

Jagan: రేపు హైదరాబాద్‌కు జగన్.. కోర్టుకు వెళ్లకుండా, కొత్త ప్లాన్?
Advertisement

ఆరేళ్ల తర్వాత అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం జగన్ నాంపల్లి సీబీఐ కోర్టుకి హాజరు కాబోతున్నారు. ఇన్నాళ్లూ ఈ కేసు విషయంలో కోర్టుకి రాకుండా పర్మిషన్లు తెచ్చుకున్న జగన్, ఇక కుదరకపోయే సరికి కోర్టుకి వస్తున్నారు. అయితే ఆయన కోర్టుకి వచ్చే సమయంలో వైసీపీ హడావిడి చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆ హడావిడిని చూపెట్టి జగన్ కోర్టుకి రాకుండా తిరిగి పర్మిషన్ పొందే అవకాశముందని అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి దీనికి సంబంధించి తెలంగాణ పోలీస్ శాఖ ముందుగానే అప్రమత్తం అయిందా, అసలు రేపు జగన్ ఎంట్రీతో హైదరాబాద్ లో ఏం జరుగుతుంది? వెయిట్ అండ్ సీ.

చివరి వరకు ప్రతయ్నాలు..
అక్రమాస్తుల కేసులో జగన్ చివరిసారిగా 2020 జనవరి 10న నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అప్పట్లో ఏపీలో పాదయాత్ర చేస్తున్న సమయంలో వారం వారం ఆయన కోర్టుకు హాజరయ్యేందుకు యాత్రనుంచి విరామం తీసుకునేవారు. అప్పట్లో దీనిపై టీడీపీ విపరీతంగా ట్రోల్ చేసేది. అయితే 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ఘన విజయం తర్వాత, జగన్ ముఖ్యమంత్రి కావడంతో కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందారు. సెక్యూరిటీ కారణాలను చూపిస్తూ జగన్ కోర్టుకి రాకుండా వాయిదాలు పొందారు. వ్యక్తిగత హాజరు లేకుండా చూసుకున్నారు.

Advertisement

వైసీపీ ఓడిపోవడంతో..
2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో జగన్ సీఎం పదవి కోల్పోయారు. దీంతో సెక్యూరిటీ రీజన్స్ చెప్పి కోర్టు హాజరు నుంచి మినహాయింపు తీసుకోవడం కష్టంగా మారింది. అప్పటికీ వివిధ కారణాలు చెబుతూ కోర్టుని పర్మిషన్ అడిగారు. కానీ కుదర్లేదు. అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరుకావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈనెల 21లోపు విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని చెప్పడంతో రేపు ఉదయం హైదరాబాద్‌ నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టుకు జగన్ వచ్చేందుకు సిద్ధమయ్యారు.

వైసీపీ హడావిడి!
జగన్ ఏ టైమ్ కి స్పెషల్ ఫ్లైట్ ఎక్కుతారు. గన్నవరం నుంచి ఎప్పుడు బేగంపేట వస్తారు, అక్కడ్నుంచి ఎలా నాంపల్లికి వస్తారనే రూప్ మ్యాప్ ని ముందుగానే వైసీపీ లీక్ చేసింది. వైసీపీ అనుకూల సోషల్ మీడియా అకౌంట్లలో ఈ వివరాలన్నీ బయటకు వచ్చాయి. అంటే బేగంపేట ఎయిర్ పోర్ట్ వద్ద నుంచి జగన్ కి స్వాగతం పలికేందుకు హైదరాబాద్ లో వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యాయని స్ఫష్టమవుతోంది. ఈ హడావిడితో సెక్యూరిటీ రీజన్స్ చెప్పి జగన్ మళ్లీ కోర్టుని పర్మిషన్ అడిగే అవకాశముందని టీడీపీ అనుమానిస్తోంది.

Advertisement

https://twitter.com/vinayk1111/status/1990637924443173359?s=20

Also Read: ఎన్డీఏలో కీలకంగా లోకేష్.. బీహార్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రత్యేక ఆహ్వానం

2019 తర్వాత తొలిసారి ప్రతిపక్ష నేతగా జగన్ హైదరాబాద్ లో అడుగు పెడుతున్నారని, పార్టీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యాయంటూ వైసీపీ సోషల్ మీడియా అకౌంట్లు హోరెత్తిపోతున్నాయి. అదే సమయంలో టీడీపీ అనుకూల అకౌంట్లలో జగన్ ఉద్దేశపూర్వకంగానే భారీ జనసమీకరణకు ప్రయత్నిస్తున్నారంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ రేపు హైదరాబాద్ లో ఏంజరుగుతుంది? జగన్ కోసం భారీగా జనం వస్తారా? వచ్చినవారు ఊరికే ఉంటారా? ఈ హడావిడిని తెలంగాణ పోలీసులు ఎలా కంట్రోల్ చేస్తారనేది వేచి చూడాలి.

Also Read: I-బొమ్మస్థానంలో J-బొమ్మ, N-బొమ్మ..

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×