E-Paper
Advertisement

AP Politics: ఇలాగైతే నక్సలైట్లు పుట్టుకొస్తారు.. చంద్రబాబు ప్రభుత్వానికి జగన్ వార్నింగ్

AP Politics: ఇలాగైతే నక్సలైట్లు పుట్టుకొస్తారు.. చంద్రబాబు ప్రభుత్వానికి జగన్ వార్నింగ్
Advertisement

AP Politics: ఏపీలో వైసీపీ రూటు మార్చిందా? కూటమి సర్కార్‌పై విమర్శల దాడిని తీవ్రతరం చేసిందా? ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించకుంటే నక్సలైట్లు పుట్టుకొస్తారని జగన్ ఎందుకున్నారు? చంద్రబాబు ప్రభుత్వాన్ని జగన్ హెచ్చరిస్తున్నారా? నేరాలు చేసినవారికి మద్దతు పలుకుతున్నారా? ఈ వ్యవహారంపై ఇప్పడు ఏపీ అంతా చర్చ మొదలైంది.

చంద్రబాబు సర్కార్‌పై జగన్ హాట్ వ్యాఖ్యలు

Advertisement

చంద్రబాబు ప్రభుత్వంపై దూకుడు పెంచారు వైసీపీ అధినేత జగన్. ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. చేసిన ఆరోపణలను ఎలాంటి ఆధారాలు చూపలేదు. కాకపోతే మాటల వేడిని తీవ్రతరం చేస్తున్నారు. అఫ్‌కోర్సు.. గడిచిన ఏడాదిన్నరగా మీడియా ముందుకొచ్చిన ప్రతీసారీ అదే చేశారు.. చేస్తున్నారు కూడా.

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలు చాలా కేసుల్లో ఇరుక్కున్నారు. చాలామంది జైలుకి వెళ్తున్నారు. ఒకొక్కరిపైనా అర డజనకు పైగానే కేసులు లేకపోలేదు. ఆ కేసుల్లో వారిని పోలీసులు లేదా సిట్ విచారణ చేస్తున్నారు.  గురువారం మీడియా ముందుకొచ్చిన మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

కేసులు పెట్టుకుంటూ పోతే నక్సలైట్లు పుట్టుకొస్తారన్న జగన్

ముఖ్యంగా పిన్నెల్లి సోదరుల కేసుల గురించి ప్రధానంగా మాట్లాడారు మాజీ సీఎం జగన్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనపై 16 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. ఇలా అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతే నక్సలైట్లు పుట్టుకొస్తారని చెప్పకనే చెప్పారు. విశాఖలో వైసీపీ విద్యార్థి నేతను గంజాయి కేసులో ఇరికించారని, విచారణ పేరుతో స్టేషన్‌లో నిర్భంధించారని వెల్లడించారు.

టీడీపీలో గ్రూపు తగాదాలతో వాళ్లలో వాళ్లు హత్యలు చేసుకుని ఆ కేసులో పిన్నెల్లిని ఇరికించారంటూ ఆయనకు మద్దతు పలికే ప్రయత్నం చేశారు. ఇదే కాదు.. వైసీపీ నేతలు ఏ కేసులో ఇరుక్కుని అరెస్టయినా, అదంతా కావాలనే చంద్రబాబు చేస్తున్నారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ లెక్కన వైసీపీ వారిపై కేసులు నమోదు చేయవద్దని మీడియా ముందు ఓపెన్‌గా చెబుతున్నారు.

ALSO READ:  ఏపీలో రైతులకు కష్టాలు,  పులివెందుల మాటలను రిపీట్ చేసిన జగన్

అలాంటప్పడు మద్యం కేసు 50 మందికి పైగా ఎలా అరెస్టయ్యారన్నది టీడీపీ నేతల మాట. ఇదే సమయంలో టీడీపీ నేతలు కొత్త విషయాలను బయటపెట్టారు. వైసీపీలో మొదటి నుంచి నేరాలు, క్రిమినల్ చేసేవారికి వత్తాసు పలుకుతోందని, ఆ పార్టీ నిండా చాలావరకు అలాంటివారు ఉన్నారని పదేపదే చెబుతున్నారు. కాకపోతే నక్సలైట్లు పుడతారని జగన్ చెప్పడం, ఆ విధంగా వారిని ప్రొత్సహిస్తున్నారా?

చాలామంది వైపీసీ నేతలు వివిధ కేసుల్లో ఇరుక్కుపోయారు. వారిని చూసి మిగతా నాయకులు మీడియా ముందుకు రావడానికి ముఖం చాటేస్తున్నారు. కనీసం మీడియా ముందు ఆ పార్టీ వాయిస్ బలంగా వినబడలేదు. అసహనంతో జగన్ అలా అన్నారని అంటున్నారు. జగన్ అన్న మాటలు తేలిగ్గా తీసుకోరాదని అంటున్నవాళ్లూ లేకపోలేదు. జగన్ వ్యాఖ్యలపై టీడీపీ ఏ విధంగా కౌంటరిస్తుందో వెయిట్ అండ్ సీ.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×