E-Paper
Advertisement

Jagan Guntur tour: గుంటూరు మిర్చియార్డులో జగన్

Jagan Guntur tour: గుంటూరు మిర్చియార్డులో జగన్
Advertisement

Jagan Guntur tour: వైసీపీ అధ్యక్షుడు జగన్ గుంటూరు పర్యటనకు శ్రీకారం చుట్టారు.  మిర్చియార్డు పర్యటనపై ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఈ నేపధ్యంలో మిర్చి యార్డులో సమావేశాలు నిర్వహించడం నిషేధం అంటూ మైకులో ప్రచారం చేశారు అధికారులు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ప్రకటన చేశారు.

జగన్ పర్యటించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పార్టీ నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో జగన్ పర్యటనపై సందిగ్థత నెలకొంది. ఒకవేళ గుంటూరు వైపు వస్తే.. జగన్ కాన్వాయ్‌ని  అధికారులు అడ్డుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పర్యనటపై గుంటూరు అధికారులకు గానీ, ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి కోరే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఇది పూర్తిగా  రాజకీయాలకు దూరంగా ఉండే పర్యటన అని చెబుతున్నారు.

Advertisement

కేవలం మిర్చి యార్డులో ఉన్న రైతుల కష్టాలు తెలుసుకుంటారని, వారి ఆవేదనను వింటారని అంటున్నారు ఆ పార్టీ నేతలు. ధరల పతనం ఎందుకు జరిగింది? ఈ విషయంలో రైతుల బాధను తెలుసుకునేందుకు మాత్రమే వస్తున్నారని అంటున్నారు. రైతులు తమ సమస్యలను జగన్‌కు వివరించనున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చి న్యాయం చేసేందుకు కృషి చేయాలన్నది వైసీపీ ఆలోచనగా నేతలు చెబుతున్నారు.

జగన్ పర్యటనకు ఎన్నికల కమిషన్‌ అనుమతి నిరాకరించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉన్నందున రాజకీయ కార్యకలాపాలకు అవకాశం ఇవ్వబోమని తేల్చి చెప్పింది. ఇదిలాఉండగా జగన్‌ పర్యటన షెడ్యూల్‌ను వైసీపీ విడుదల చేసింది. బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి జగన్ బయలుదేరనున్నారు.

Advertisement

ALSO READ: జగన్‌కు కష్టాలు తప్పవా? కేసు నమోదు?

11 గంటలకు మిర్చి యార్డుకు రానున్నారు. 12 గంటల వరకు యార్డులో రైతులతో చర్చించి తరువాత తిరిగి తాడేపల్లికి వెళ్లనున్నారు. ఎన్నికల కమిషన్‌ అనుమతి నిరాకరించడంతో మాజీ సీఎం పర్యటనపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు వైసీపీ సోషల్ మీడియా మాత్రం జగన్ గుంటూరు మిర్చియార్డుకు వెళ్తున్నారని రాసుకొచ్చింది. మద్దతు ధర లేక గుంటూరు మిర్చియార్డు నుంచి కన్నీళ్లతో రైతులు ఇంటికి వెళ్తున్నారని ప్రస్తావించింది. అన్నదాతలకి అండగా నిలిచేందుకు జగన్ వెళ్తున్నట్లు పేర్కొంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×