E-Paper
Advertisement

Jagan: సీఎం చంద్రబాబుపై జగన్ సెటైర్లు.. క్రెడిట్‌ చోరీ స్కీం అదిరిందయ్యా చంద్రం!

Jagan: సీఎం చంద్రబాబుపై జగన్ సెటైర్లు.. క్రెడిట్‌ చోరీ స్కీం అదిరిందయ్యా చంద్రం!
Advertisement

Jagan: ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు స్కీములు కంటిన్యూ చేస్తాయి. కాకపోతే ప్రభుత్వాల బట్టి కొన్నింటికి పేర్లు మారుతుంటాయి. బుధవారం సీఎం చంద్రబాబు మూడు లక్షల ఇళ్లు పంపిణీని తన ఖాతాలో వేసుకోవడంపై మాజీ సీఎం జగన్ కాస్త కోపం వచ్చింది. క్రెడిట్ చోరీ స్కీమ్ చాలా బాగుందంటూ ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. అసలు మేటరేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

క్రెడిట్‌ చోరీ స్కీం అదిరిందయ్యా చంద్రం!

Advertisement

ఏపీ వ్యాప్తంగా బుధవారం మూడు లక్షల ఇళ్లను లబ్దిదారులకు అప్పగించారు సీఎం చంద్రబాబు. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలంలో పేదల ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు స్వయంగా హాజరయ్యారు. లబ్దిదారులకు ఆ ఇంటి తాళాలను అందజేశారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పారు.

బుధవారం సీఎం చంద్రబాబు ఇళ్ల కార్యక్రమం గురించి గురువారం ‘సాక్షి’ గెజిట్‌లో తాటికాయంత అక్షరాలతో పెద్ద కథనాన్ని ప్రచురించింది. జగన్ ప్రభుత్వం కట్టిన ఇళ్లకు బాబు కలరింగ్ అంటూ టైటిల్ పెట్టేసింది. పేపర్ క్లిప్పుంగులను కట్ చేసి వైసీపీ ఎక్స్ వేదికగా వాటిని షేర్ చేసింది.

Advertisement

మూడు లక్షల ఇళ్లపై జగన్ కామెంట్స్

అందులో మేటర్‌ని మాజీ సీఎం జగన్ తనదైన శైలిలో వ్యంగ్యంగా రాసుకొచ్చారు. మీ కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న క్రెడిట్‌ చోరీ స్కీమ్ చాలా బాగుందంటూ పేర్కొన్నారు.  వైసీపీ హయాంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలను చూపిస్తూ ఇళ్లన్నీ తాము కట్టేశామంటూ పచ్చి అబద్దాలు ఆడుతున్నారని విమర్శలు గుప్పించారు.

పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం సేకరించకుండా, వైసీపీ ప్రభుత్వంలో శాంక్షన్‌ చేయించిన ఇళ్లను మా ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేశామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని రాసుకొచ్చారు. ఆ క్రెడిట్‌ మీదేనంటూ మీరు చేస్తున్న క్రెడిట్‌ చోరీ స్కీం హేయంగా ఉందన్నారు. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదని, నాటకాల రాయుడిగా వర్ణించారు.

ALSO READ:  ఇండియాలో క్లీన్ అండ్ సేఫ్ సిటీ విశాఖ- సీఎం చంద్రబాబు

ఆ మూడు లక్షల ఇళ్లలో సగానికి పైగా మా హయాంలోనే పూర్తయ్యే దశలో ఉన్నవేనని పేర్కొన్నారు. సరిగ్గా రెండేళ్ల కిందట అంటే అక్టోబరు 12, 2023న ఒకేసారి 7,43,396 ఇళ్లలో ఒకే రోజు గృహ ప్రవేశాలను చేయించి మా ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. అన్నీ చేసినట్టుగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేయడం, ఈ విషయంలో మీ స్కీమ్ చాలా హేయంగా ఉందన్నారు.

గూగుల్ సంస్థను తాము విశాఖకు తీసుకొచ్చామని చెప్పిన విధంగానే..  మూడు లక్షల ఇళ్ల నిర్మాణం తాము చేశామని చెప్పే ప్రయత్నం చేశారు జగన్.  కూటమి ప్రభుత్వం ఏం చేసినా, గతంలో తాము మేము చేశామని ఈ మధ్యకాలంలో పదేపదే ప్రస్తావించడాన్ని టీడీపీ నేతలు నవ్వుకుంటున్నారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×