E-Paper
Advertisement

Jagan : కోడికత్తి కేసు.. విచారణకు రాలేను.. కోర్టులో జగన్ పిటిషన్..

Jagan : కోడికత్తి కేసు.. విచారణకు రాలేను.. కోర్టులో జగన్ పిటిషన్..
Advertisement

Jagan : 2019 ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో కోడికత్తితో దాడి జరగడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. తాజాగా ఈ కేసులో సీఎం జగన్ కోర్టులో‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో జరుగుతోంది. జగన్ విచారణకు హాజరుకావాలని గత విచారణ సమయంలో మెజిస్ట్రేట్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలో తాజాగా జగన్‌ పిటిషన్‌ వేశారు. అడ్వకేట్‌ కమిషనర్‌ ద్వారా సాక్ష్యం నమోదుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

రాష్ట్రానికి సీఎంగా అనేక బాధ్యతలున్నాయని జగన్ పిటిషన్ లో పేర్కొన్నారు.పేదలకు అందించే సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశాలు ఉన్నాయని తెలిపారు. కోర్టుకు సీఎం హాజరైతే భద్రత కోసం వచ్చే వాహనాలతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. అడ్వకేట్‌ కమిషనర్‌ను నియమించి ఆయన సమక్షంలో సాక్ష్యం నమోదు చేయించాలని కోరారు.

Advertisement

ఈ కేసు దర్యాప్తును లోతుగా జరపాలని కోరుతూ మరో పిటిషన్‌ను కూడా సీఎం జగన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఈ నెల 13న విచారణ జరుపుతామని ఎన్‌ఐఏ కోర్టు ప్రకటించింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×