E-Paper
Advertisement

Jagan Moves AP High Court: హైకోర్టును ఆశ్రయించిన జగన్.. ప్రతిపక్ష హోదా ఇప్పించాలంటూ రిక్వెస్ట్

Jagan Moves AP High Court: హైకోర్టును ఆశ్రయించిన జగన్.. ప్రతిపక్ష హోదా ఇప్పించాలంటూ రిక్వెస్ట్
Advertisement

Jagan Moves AP High Court: ప్రతిపక్ష నేత హోదా కోసం వైఎస్ జగన్ తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని గతంలో ఆయన స్పీకర్ లేఖ రాశారు. అయితే, ఆ హోదా ఇచ్చేందుకు స్పీకర్ నిరాకరించారు. ఆయనను కేవలం వైసీపీ ఫ్లోర్ లీడర్ గానే గుర్తిస్తున్నట్లు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని స్పీకర్ ను ఆదేశించాలంటూ అందులో పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత హోదా కోసం లేఖ రాసినా కూడా ఇవ్వలేదంటూ ఆ పిటిషన్ లో ప్రస్తావించారు.

Also Read: విశాఖ శారదా పీఠాధిపతికి భద్రతను కుదించిన ప్రభుత్వం

Advertisement

కాగా, ఏపీలో అధికార పార్టీ కాకుండా ఉన్న మరో పార్టీ తమదేనంటూ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధమంటూ వాదిస్తూ వస్తున్నారు. అసెంబ్లీ మొత్తం సభ్యుల్లో 10 శాతం సీట్లు ఉంటేనే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని రాజ్యాంగంలో లేదంటూ జగన్ ఇంతుకుముందు స్పీకర్ కు లేఖ రాశారు. మామూలుగా అయితే 10 శాతం సీట్లు వస్తే వారిని ప్రతిపక్ష నేతగా గుర్తిస్తారు. రెండు, మూడు పార్టీలకు 10 శాతం కంటే ఎక్కువ సీట్లు వస్తే.. ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీ స్పీకర్ గుర్తిస్తారు. కానీ, ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. కనీసం 18 సీట్లు వచ్చి ఉంటే ఈ విధంగా జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని స్పీకర్ ను అడగాల్సి వచ్చేది కాదు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×