E-Paper
Advertisement

YS Sharmila on YS Jagan: వైఎస్‌ఆర్‌కి వారసుడివా..? బీజేపీకి దాసుడివా..? షర్మిల యుద్ధం!

YS Sharmila on YS Jagan: వైఎస్‌ఆర్‌కి వారసుడివా..? బీజేపీకి దాసుడివా..? షర్మిల యుద్ధం!
Advertisement

వైసీపీ అధినేత జగన్‌పై పీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిలారెడ్డిల మరోసారి భగ్గుమన్నారు. ఏపీలో ఎన్నికల ముందు అన్న ప్రభుత్వంలో అవకతవకలు, తప్పులను బహిరంగంగా విమర్శించిన షర్మిల తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక అడుగు ముందుకు వేసి.. అసలు వైసీపీకి దివంగత సీఎం వైఎస్‌కు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. వైఎస్ పూర్తిగా కాంగ్రెస్ మనిషన్న షర్మిల.. బీజేపీకి.. వైసీపీ.. తోకపార్టీ అని ఘాటు విమర్శలు చేశారు. బీజేపీ ఉంచుకున్న పార్టీ వైసీపీ అంటూ తనదైన శైలిలో ధ్వజమెత్తారు.

Advertisement

వైసీపీ 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయినా.. 39 శాతం ఓట్లు దక్కించుకుంది. అయితే ఆ ఓట్లన్నీ వైసీపీ ఓటు బ్యాంకు కాదంటున్నారు షర్మిల.. గత ఎన్నికల్లో వైసీపీకి పడిన 39 శాతం ఓట్లన్నీ కాంగ్రెస్‌ సంప్రదాయ ఓటు బ్యాంకే అంటున్నారు. 2029 ఎన్నికల్లో ఆ ఓట్లన్నీ కాంగ్రెస్‌కు పడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి పడ్డ ఓట్లన్నీ చంద్రబాబు సీఎం కాకూడదని పడిన ఓట్లని  మొన్నటి ఎన్నికలు చంద్రబాబు సీఎంగా కావాలా.. వద్దా అనే అంశంపైనే జరిగాయని పీసీసీ చీఫ్ విశ్లేషించారు.

Also Read: మీరు నన్ను ట్రోల్ చేయలేదా? మంచైనా, చెడైనా చేస్తారు మరీ: అంబటి

Advertisement

మాటకు ముందు తండ్రి పేరు చెప్పుకునే జగన్‌.. వైఎస్ 75వ జయంతిని ఆయన ఘనంగా నిర్వహించకపోవడాన్ని తప్పుపట్టారు. అసెంబ్లీలో సాధారణ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి కనీసం కూర్చోకుండా వెళ్లి పోయిన జగన్.. ఇడుపులపాయలో వైఎస్‌కు నివాళులు అర్పించిన తర్వాత కూడా కనీసం 5 నిమిషాలు అక్కడ నిలబడలేదు. దాన్ని ఎత్తి చూపించిన షర్మిల సిద్ధం పేరుతో పెద్ద పెద్ద సభలు పెట్టి.. ఒక్కోసభకు 30-40 కోట్లు ఖర్చు పెట్టిన జగన్‌.. రాజశేఖర్‌రెడ్డి కోసం కనీసం ఒక్క సభ కూడా పెట్టలేరా అని ప్రశ్నించారు. తండ్రి పేరు చెప్పుకుని రాజకీయం చేస్తున్న జగన్.. తండ్రి కోసం ఏం చేశారని మీరు రాజశేఖర్‌రెడ్డి వారసులవుతారని ప్రశ్నిస్తున్నారు.

పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల తన తండ్రి జయంతిని అత్యంత ఘనంగా నిర్వహించారు.. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దానికి హాజరై కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపారు. రాహుల్‌గాంధీ సైతం గొప్ప సందేశంతో వైఎస్‌కు నివాళులర్పించారు. అయితే ఇడుపలపాయలో జగన్ వైఎస్ జయంతిని తూతూ మంత్రంగా నిర్వహించడంపై వైసీపీ శ్రేణుల నుంచే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు జగన్ వైఖరిని షర్మిల టార్గెట్ చేస్తున్నారు. ఆ క్రమంలో వైఎస్‌పై పేటెంట్ కాంగ్రెస్‌దేనని. సొంత మీడియాలో తండ్రి బొమ్మ తీసేసిన జగన్ వైఎస్ వారసుడ్నని ఎలా చెప్పుకుంటారన్న చర్చ మొదలైంది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×