E-Paper
Advertisement

YSRCP Formation Day: పార్టీ ఆవిర్భావ వేడుకలు.. జగన్ కీలక వ్యాఖ్యలు, దేశ రాజకీయాల్లో వైసీపీ మార్క్

YSRCP Formation Day: పార్టీ ఆవిర్భావ వేడుకలు.. జగన్ కీలక వ్యాఖ్యలు, దేశ రాజకీయాల్లో వైసీపీ మార్క్
Advertisement

YSRCP Formation Day: విలువలు, విశ్వసనీయత కేరాఫ్ తామేనని మరోసారి పునరుద్ఘాటించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. దేశ రాజకీయాల్లో వైసీపీ అనేది ఒక్క మార్క్, ఇవాళ ప్రబలంగా కనిపిస్తోందని  చెప్పుకొచ్చారు. ఈ పార్టీ ఏ పరిస్థితుల్లో ఏర్పడిందో మీకు తెలుసని వివరించారు.

తాడేపల్లిలో వైసీపీ పార్టీ ఆవిర్భావ వేడుకలు

Advertisement

వైసీపీ పార్టీ ఏర్పడి గురువారం నాటికి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అమరావతిలోని పార్టీ ఆఫీసులో జెండాను అధినేత జగన్ ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, కీలక వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల కిందట ఈ పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో పుట్టింది అన్నది అందరికీ తెలుసన్నారు. ఆనాడు చెప్పిన ఒక్కమాట వైసీపీ ఎదుగుదలకు కారణమైందన్నారు.

రాష్ట్రంలో వైసీపీ దశ, దిశ మార్చిందన్నారు మాజీ సీఎం. విలువలు, విశ్వసనీయత అనే పదాలకు అర్థం చెబుతూ పార్టీ పుట్టుక, ఎదుగుదల కొనసాగిందన్నారు. ఈ పార్టీ జగన్‌ది కాదని, కోట్లాది మంది కార్యకర్తలు, అభిమానులదని అన్నారు. ఆనాడు జగన్ అనేవాడు ఒక్కడేనని గుర్తు చేశారు.

Advertisement

దేశ రాజకీయాల్లో వైసీపీ మార్క్ అన్న జగన్ 

ఉమ్మడి ఏపీ, దేశంలో ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉందన్నారు. కాంగ్రెస్-టీడీపీ చేసిన కుట్రలు, కుతంత్రాలు చూశామన్నారు. పైన దేవుడు.. కింద జనంపై జగన్‌కు నమ్మకం ఉందన్నారు. నమ్ముకున్న ప్రజలు, దేవుడు తోడుగా ఉండి పార్టీని నడిపించారని వివరించారు.  విలువలు, విశ్వసనీయతకు వైసీపీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందన్నారు చెప్పకనే చెప్పారు.

తనతోపాటు నడిచేవారు గర్వంగా చెప్పుకునేలా పార్టీ అడుగులు వేస్తుందన్నారు. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం స్థాపించిన పార్టీని తనను మీరు గుండెల్లో పెట్టుకున్నారని, భుజాలపై మోస్తున్నారని చెప్పుకొచ్చారు. మన పార్టీ ప్రస్థానం కేవలం ఒక రాజకీయ ప్రయాణం మాత్రమే కాదని, లక్షలాది మంది కార్యకర్తల క‌ష్టం, నమ్మకం, త్యాగాలకు నిలువెత్తు సాక్ష్యమని వివరించారు.

ALSO READ: ‘ఆ నలుగురు బ్రోకర్ల చేతుల్లోనే ఏపీ..!’.. చంద్రబాబు సర్కార్‌పై చింతామోహన్ నిప్పులు

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు పేరు పేరునా శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ఆర్‌ను అభిమానించే ప్రతీ గుండె ఇక్కడే కాదు, పొరుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ తన ప్రసంగాన్ని ముగించారు వైసీపీ అధినేత. ఇదే జగన్ 15 ఏళ్ల కింద స్పీచ్ ఓ రేంజ్‌లో ఉండేదని, ఇప్పుడు మాటల్లో ఏ మాత్రం పసలేదని ప్రత్యర్థుల నుంచి కౌంటర్లు పడిపోతున్నాయి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×