E-Paper
Advertisement

Jagan Vs Chandrababu: ఈసారి ఏపీ వంతు.. చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం, మళ్లీ అవే మాటలు

Jagan Vs Chandrababu: ఈసారి ఏపీ వంతు.. చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం, మళ్లీ అవే మాటలు
Advertisement

Jagan Vs Chandrababu: మాజీ సీఎం జగన్ రూటు మార్చారా? కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? నదీ జలాల పేరుతో సీమవాసులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని తెరపైకి తెచ్చారా? సీమ ప్రజలకు చంద్రగ్రహణం పట్టిందా? ముమ్మాటికీ అవుననే అంటున్నారు మాజీ సీఎం జగన్.

Advertisement

ఏపీలోనూ నదీ జలాల రగడ

Advertisement

తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల అంశం వేడెక్కింది. ఈ వ్యవహరంపై పోయిన వారం తెలంగాణలో అధికార కాంగ్రెస్-బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యద్ధం తారాస్థాయికి చేరింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వ్యవహారంపై అసెంబ్లీ లోపల, బయట మాటల యుద్ధం సాగింది. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించిన మాటలను తనకు అనుకూలంగా మలచుకున్నారు మాజీ సీఎం జగన్.

గురువారం ఉదయం మీడియా ముందుకు వచ్చారు మాజీ సీఎం జగన్. తాను కోరడంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు చంద్రబాబు ప్రభుత్వం నిలిపి వేసిందని సీఎం రేవంత్ చెప్పడాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు జగన్. దీనిపై మరుసటి రోజు ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం

న్యాయస్థానం ఆదేశాలతో వైసీపీ హయాంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగిపోయినట్టు వెల్లడించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం మొదలుపెట్టారు. సీమవాసులకు చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేసిందని, వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకపోవడంతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు గ్రహణం పట్టిందన్నారు.

నార్మల్‌గా జగన్ హయాంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ అభ్యంతరాలు వ్యక్తం చేయడం, ఎన్జీటీ-సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. గడిచిన ఐదేళ్లలో ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేదు అప్పటి వైసీపీ ప్రభుత్వం. చివరకు పోలవరం ప్రాజెక్టుని గాలికి వదిలేసింది. ఫలితంగా ఎప్పుడో పూర్తికావాల్సి పోలవరం ప్రాజెక్టు నత్తనడకగా సాగింది.

ALSO READ: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్.. చంద్రబాబు వైఖరిపై జగన్ ఫైర్

ఆ విషయంలో కూటమి ప్రభుత్వంపై నెపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తున్నారు మాజీ సీఎం. గతంలో చంద్రబాబు ప్రభుత్వం పులివెందులకు పట్టిసీమ ద్వారా నీరు ఇచ్చారు. వైసీపీ హయాంలో దాన్ని గాలికి వదిలేశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు హంద్రీనీవా ద్వారా నీటని ఇస్తున్నామని వైసీపీ బిల్డప్ ఇచ్చింది. సినిమా సెట్టింగ్ తరహాలో క్రస్ట్ గేట్లు ఏర్పాటు చేసి నీళ్లు వదిలారు జగన్.

ఆ కార్యక్రమం పూర్తి కాగానే సెట్టింగ్ గేట్లు పీకేశారు అధికారులు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పేరుతో వెయ్యి కోట్లు వృథా చేశారు. హంద్రీ-నీవాపై కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో రూ.3,800 కోట్లు పైగానే ఖర్చు చేసింది.  ప్రాజెక్టుల గురించి జగన్ మాట్లాడిన నాలుగు మాటలు ఆయన తప్పులను ఎదుటివారిపై నెట్టేసే ప్రయత్నం చేశారని టీడీపీ నేతలు అంటున్నారు. జగన్ మాటలపై టీడీపీ ఏ విధంగా కౌంటరిస్తుందో చూడాలి.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×