E-Paper
Advertisement

వైసీపీని వెంటాడుతున్న ‘సర్’.. ఆపై జగన్ కీలక వ్యాఖ్యలు.. ఈ రెండూ డేంజరేనని వ్యాఖ్య

వైసీపీని వెంటాడుతున్న ‘సర్’.. ఆపై జగన్ కీలక వ్యాఖ్యలు.. ఈ రెండూ డేంజరేనని వ్యాఖ్య
Advertisement

Jagan On SIR: ఏపీవ్యాప్తంగా జూన్ 15 నుంచి ఎన్నికల సంఘం చేపట్టనున్న ‘SIR’ కార్యక్రమంపై మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.  ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు.  ఎస్‌ఐఆర్‌పై దేశవ్యాప్తంగా అనేక భయాలు, ఆందోళనలను రాజకీయ పార్టీలు వ్యక్తం చేయడాన్ని గుర్తు చేశారు. దీంతో వైసీపీలో సర్ గురించి కొత్త టెన్షన్ మొదలైంది.

వైసీపీని వెంటాడుతున్న ‘సర్’ భయం

Advertisement

బుధవారం తాడేపల్లి పార్టీ ఆఫీసులో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సర్‌పై మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్‌ఐఆర్‌పై దేశ వ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు భయాలు, ఆందోళనలు వ్యక్తం చేయడం చూశామన్నారు. అంతేకాదు ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలను ప్రభావితం చేసిందన్న వాదనలను గుర్తు చేశారు.

పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు ఏం జరిగిందో అంతా చూశారని వివరించారు. బెంగాల్‌లో 91 లక్షలు, తమిళనాడులో 74 లక్షలు మొత్తం ఓట్లలో తొలగించారు. చివరకు మమతా బెనర్జీ పోటీచేసిన భవానీపూర్‌లో 44,990 ఓట్లను తొలగించారని, అందుకే ఆమె అక్కడ ఓడిపోయారని చెప్పుకొచ్చారు.

Advertisement

జగన్ కీలక వ్యాఖ్యలు.. ఈ రెండూ డేంజరేనని వ్యాఖ్య

తమిళనాడులో స్టాలిన్‌ పోటీ చేసిన నియోజకవర్గంలో అదే పరిస్థితి ఎదురైందని, ఆయన ఓటమి పాలయ్యారని గుర్తు చేశారు. బెంగాల్‌లో తొలగించిన ఓట్లు 91 లక్షలని వివరించారు. ఆ రాష్ట్రంలో టీఎంసీ కేవలం 31 లక్షల తేడాతో ఓటమిపాలైంది. తమిళనాడులో తొలగించింది 74 లక్షల అయితే, డీఎంకే పార్టీ 17 లక్షల తేడాతో ఓడిపోయిందని లెక్కలతో సహా వివరించారు.

అందుకే వచ్చేనెల 15 నుంచి ఎన్నికల సంఘం చేపట్టనున్న ఎస్‌ఐఆర్‌పై పార్టీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచన చేశారు. ఏపీలో ఓట్లు పెరగడం వల్ల వైసీపీ ఓటమి పాలైందని, తమిళనాడు-బెంగాల్‌లో ఓట్లు తొలగించడం వల్ల అధికార పార్టీలు ఓడిపోయాయని, రెండూ డేంజరేనని చెప్పుకొచ్చారు.

ALSO READ: ‘మహానాడు’ వేదికగా సరికొత్త రికార్డు.. లోకేష్ బాధ్యతలపై ఎంపీ శ్రీభరత్ కీలక వ్యాఖ్యలు!

ఒక్కో ఊరికి 50 ఓట్లు తొలగిస్తే నియోజకవర్గానికి 5 వేలు పోయినట్టేనని మనసులోని మాట బయటపెట్టారు. కేవలం మన ఓట్ల గురించే కాకుండా అదే సమయంలో టీడీపీ బోగస్‌ ఓట్ల మీద దృష్టి పెట్టాలని సూచించారు. ఏపీలో ఓట్ల జాబితా ఓ మిస్టరీ అని, తప్పుడు ఓట్లు మీద దృష్టి పెట్టాలని కేడర్ దిశానిర్ధేశం చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×