E-Paper
Advertisement

Jagan Comments: ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతోంది: జగన్

Jagan Comments: ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతోంది: జగన్
Advertisement

Jagan Comments on Chandrababu:  మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి చంద్రబాబుపై ఫైరయ్యారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందంటూ ఆయన కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘హత్య చేసినవాళ్లు ఎవరు..? చేయించినవాళ్లు ఎవరు? ప్రతి చోట ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పారు.

ఎన్నికలు అయిపోయిన తరువాత చిన్నపిల్లలను మోసం చేశాడు. తల్లికి వందనం అని చెప్పి చివరకు పంగనామం పెట్టాడు. రైతులకు రూ. 20 వేలు ఇస్తామని మోసం చేశాడు. జగన్ అధికారంలో ఉండి ఉంటే ఇప్పటికే అమ్మఒడి డబ్బులు పడేవి. పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన చేస్తున్నారు.

Advertisement

చంద్రబాబు వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు. ఊర్లలో ఆధిపత్యం కోసం టీడీపీ నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనే ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది.

Also Read: వైసీపీ కీలక నేత, మాజీ డిప్యూటీ సీఎం రాజీనామా

Advertisement

అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా.. లేదా? సీతారామాపురంలో ఆధిపత్యం కోసం దాడులు చేశారు. తుపాకులు, కర్రలు, రాడ్లతో అరాచకాలు సృష్టించారు. బూత్ ఏజెంట్ గా కూర్చున్నాడని చంపేశారు. చంపినవాళ్లను పోలీసులు పట్టుకోలేదు. చంపినవాళ్లు ఊరు నుంచి వెళ్లిపోవడానికి పోలీసులు సహకరించారు.

చంద్రబాబు, లోకేష్ అండదండలతో ఎస్ఐ సమక్షంలో నరికేశారు. సుబ్బారాయుడు భార్యపైనా దాడి చేశారు. దాడి జరుగుతుంటే పోలీసులు ఆపలేదు. హత్య చేసిన తరువాత కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అంటూ జగన్ మండిపడ్డారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×