// // J.C. Prabhakar Reddy| తైతక్కలాడుకుంటూ రాజకీయాల్లోకి వచ్చి.. రోజాపై జేసీ ఫైర్ -->
E-Paper
Advertisement

JC Prabhakar Reddy : తైతక్కలాడుకుంటూ రాజకీయాల్లోకి వచ్చి.. రోజాపై జేసీ ఫైర్

JC Prabhakar Reddy : తైతక్కలాడుకుంటూ రాజకీయాల్లోకి వచ్చి.. రోజాపై జేసీ ఫైర్
Advertisement

తిరుమతిలో టోకెన్‌ గత ప్రభుత్వం తెచ్చిందని సీఎం అంటున్నారని.. అలాంటపుడు ఆ టోకెన్‌ సిస్టంను ఎందుకు తీసేయలేదన్న రోజా విమర్శలకు.. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. రోజా తిరుమలలో టోకెన్స్‌ అమ్ముకునేందుకే తరచుగా దర్శనాలకు వచ్చేవారని.. టోకెన్స్‌ అమ్ముకొని బెంజ్‌ కారు కొన్నారని ఆరోపించారు. ‘తైతక్కలాడుకుండూ రాజకీయాల్లోకి వచ్చావు.. ప్రతిదానికి తగుదునమ్మా అంటూ మాట్లాడతావు’ అని జేసీ ఫైర్ అయ్యారు. దర్శనానికి వెళ్లిన ప్రతిసారి వంద లాది మందిని వెంట తీసుకెళ్లేదని దుయ్యబట్టారు. రోజా నీ కథ చెప్పాలంటే చాలా ఉంది. చెక్ బౌన్స్ కేసులు అనంతపురం కోర్టులో ఉన్నాయన్న సంగతి మర్టిపోవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Also Read: తిరుపతి తొక్కిసలాట ఘటన.. బాధితులకు నష్టపరిహారం అందించిన టీటీడీ

చంద్రబాబు పుణ్యమాఅని రాజకీయాల్లోకి వచ్చావు.. నోరుంది కదా అని.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తప్పంతా చంద్రబాబుదే.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాము అనేక ఇబ్బందులు పడ్డామని, కాని చంద్రబాబు మాత్రం వాళ్లని గాలికి వదిలేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రోజా ఇది డ్రామా కంపెనీ కాదు.. అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.

Advertisement

ఇదిలా ఉంటే.. తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్‌ల జారీలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా.. పలువురు గాయాలు అయిన సంగతి తెలిసిందే..

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×