E-Paper
Advertisement

Aditya L1 : హై ఎనర్జీ ఎక్స్ రే చిత్రాన్ని తీసిన ఆదిత్య ఎల్-1

Aditya L1 : హై ఎనర్జీ ఎక్స్ రే చిత్రాన్ని తీసిన ఆదిత్య ఎల్-1
Advertisement

Aditya L1 : సూర్యుడిపై పరిశోధనల కోసం భారత్‌ ప్రయోగించిన ఆదిత్య-ఎల్‌1 తొలిసారిగా సౌర జ్వాలలకు సంబంధించిన హై ఎనర్జీ ఎక్స్‌రే చిత్రాన్ని క్లిక్‌మనిపించింది. ఆ వ్యోమనౌకలోని హై ఎనర్జీ ఎల్‌1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌ ఈ ఘనత సాధించింది. సౌర వాతావరణం అకస్మాత్తుగా ప్రకాశవంతం కావడాన్ని సౌర జ్వాలగా చెబుతుంటారు.

హై ఎనర్జీ ఎల్‌1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌ ను గత నెల 27న ఇస్రో ఆన్‌ చేసింది. ప్రస్తుతం ఈ పరికరాన్ని పూర్తిస్థాయి పరిశీలనలకు సిద్ధం చేస్తున్నారు. ఇది సూర్యుడికి సంబంధించిన హై ఎనర్జీ ఎక్స్‌రే చర్యలను శరవేగంగా పరిశీలించి, అధిక రిజల్యూషన్‌లో చిత్రాలను అందిస్తుంది. తాజాగా అది సౌర జ్వాలలకు సంబంధించిన ఇంపల్సివ్‌ దశను నమోదు చేసింది. దీని ద్వారా.. సూర్యుడిలో విస్ఫోటక శక్తి విడుదల, ఎలక్ట్రాన్‌ త్వరణం గురించి మరిన్ని వివరాలను అందుబాటులోకి తీసుకురావొచ్చు. ఈ పరికరాన్ని బెంగళూరులో ఇస్రోకు చెందిన స్పేస్‌ ఆస్ట్రోనమీ గ్రూప్‌ అభివృద్ధి చేసింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×