E-Paper
Advertisement

Ysjagan : ‘హిందూత్వ’ సెంటిమెంట్.. అదే జగన్ ఎన్నికల అస్త్రమా?

Ysjagan : ‘హిందూత్వ’ సెంటిమెంట్.. అదే జగన్ ఎన్నికల అస్త్రమా?
Advertisement

వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తున్నది. 2024 ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోవడానికి గల కారణాలను ఇప్పటికే గుర్తించిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో రిపీట్ కాకుండా చూడాలని భావిస్తున్నట్టు సమాచారం. జగన్ సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో మెజార్టీ ఓటర్లుగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆయన పేరొచ్చింది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తులను సిబ్బందిగా నియమించడం, కొండమీద భక్తులకు అన్యమతస్తుల ద్వారా ఎదురైన ఇబ్బందులు, తిరుమల కల్తీ నెయ్యి, టీటీడీ చైర్మన్‌గా అన్యమతస్తుడైన వైవీ సుబ్బారెడ్డిని నియమించారన్న అప్రతిష్టను జగన్ మూటగట్టుకున్నారు.

గోవిందా గోవిందా అంటే తప్పంట..

తిరుమల కొండ మీద కాలిబాటలో వెళ్లే భక్తులు సైతం గోవింద నామస్మరణ చేస్తూ వెళ్తుంటారు. ఇలా చేస్తే అలసట రాకుండా ఉండటుందని, త్వరగా స్వామి అనుగ్రహిస్తారని వారి నమ్మకం. అయితే, వైసీపీ ప్రభుత్వ హయాంలో గోవిందా గోవిందా అనుకుంటూ వెళ్తున్న భక్తులను కొందరు అన్యమతస్తులు అడ్డుకుని అభ్యంతరం వ్యక్తం చేశారని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. ఈ విషయంపై అప్పటి ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. పవిత్రమైన హిందువులు ఆరాధించే వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అన్యమతస్తులకు చోటివ్వడమే కాకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీస్తారా? అంటూ జగన్ మీద హిందూ సంఘాలు సైతం ఆగ్రహించాయి.

కల్తీ నెయ్యి ఘటన..

Advertisement

వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని అప్పట్లో పెద్ద ఇష్యూ అయ్యింది. నేటికీ ఈ పంచాయితీ తెగడం లేదు. ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లిన ఈ సమస్య మీద విచారణలు కొనసాగుతున్నాయి.దీనంతటికి కారణం అప్పటి సీఎం జగన్ అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. జగన్ అన్యమతాన్ని గౌరవించే వ్యక్తి అయినందునే ఆయనకు హిందువుల మనోభావాలు పట్టడం లేదని పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. సరిగ్గా ఎన్నికల సమయంలో ఈ అంశాలను కూటమి ప్రజల ముందు ఉంచింది. దీంతో హిందువులు అంతా కలిసి జగన్ పార్టీకి సరైన బుద్ది చెప్పారని ఫలితాల అనంతరం కూటమి నేతలు అన్నారు. స్వయంగా వేంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వారు ఎవరైనా మట్టికరవాల్సిందేనని చంద్రబాబు సైతం మండి పడ్డారు.

Kavitha : కవిత.. మరో జయలలిత?

రూటు మార్చిన జగన్..

Advertisement

ఈ క్రమంలోనే మాజీ సీఎం జగన్.. కొత్త వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో తన మీద, తన పార్టీ మీద వచ్చిన మరకలను తొలగించుకోవాలని,అందుకు హిందూత్వను ఆయన ఎన్నికల ప్రచార అస్త్రంగా మలుచుకోవాలని చూస్తున్నట్టు సమాచారం.ఏపీలో మెజార్టీ ఓటర్లు హిందువులు. ఆ తర్వాత క్రిస్టియన్స్ ఉన్నారు. క్రిస్టియన్ల సపోర్టు ఎలాగూ జగన్‌కు ఉంటుంది. అందుకే ఆయన మెజార్టీ హిందూ ఓటర్ల మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం కూటమి సర్కారు హయాంలో హిందువులకు అన్యాయం జరుగుతోందనే కొత్త అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి గతంలో తనమీద వచ్చిన మరకను తొలగించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తున్నది. తన హయాంలో కుతమతాలకు అతీతంగా సంక్షేమం అందించానని చెప్పుకుంటూనే, గత తప్పిదాలు రిపీట్ కాకుండా చూసుకుంటానని ప్రచారం చేస్తారని టాక్ వినిపిస్తోంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×