E-Paper
Advertisement

Republic Day: గణతంత్ర వేడుకలకు ఆహ్వానం.. అంధుల క్రికెట్ కెప్టెన్ దీపికకు రాష్ట్రపతి లేఖ

Republic Day: గణతంత్ర వేడుకలకు ఆహ్వానం.. అంధుల క్రికెట్ కెప్టెన్ దీపికకు రాష్ట్రపతి లేఖ
Advertisement

Republic Day: భారత రాష్ట్రపతి నుంచి అంధుల క్రికెట్ కెప్టెన్ దీపికకు ఆహ్వానం.. గణతంత్ర వేడుకలకు ప్రత్యేక అతిథిగా ఎంపిక శ్రీ సత్యసాయి జిల్లా, తనకల్లు మండలం తంబాలహట్టి గ్రామానికి చెందిన భారత మహిళా అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 26న ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను స్వయంగా వీక్షించాల్సిందిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆమెకు అధికారిక ఆహ్వానం అందింది. దేశం గర్వించదగ్గ క్రీడాకారిణిగా ఆమె సాధించిన విజయాలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

స్వగ్రామంలో అందజేసిన ఆహ్వాన పత్రం
రాష్ట్రపతి భవన్ నుండి అందిన ఈ ఆహ్వాన పత్రాన్ని తపాలా శాఖ అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి, నేరుగా దీపిక నివాసానికి వెళ్లి అందజేశారు. పోస్టల్ ఇన్‌స్పెక్టర్ జిలాన్ బాషా, మహిళా పోస్ట్ మాస్టర్ దివ్యభారతి తదితరులు తంబాలహట్టి గ్రామానికి చేరుకుని దీపికకు ఈ లేఖను స్వయంగా అందించారు. మారుమూల గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఒక క్రీడాకారిణికి రాష్ట్రపతి నుంచి పిలుపు రావడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

అంధత్వాన్ని జయించి క్రికెట్ శిఖరాలకు దీపిక ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. దీపికకు ఒక కన్ను చూపు కోల్పోయిన మనోధైర్యంతో క్రికెట్ రంగంలో అడుగుపెట్టిన ఆమె, తన అద్భుత ప్రతిభతో భారత మహిళా అంధుల జట్టుకు కెప్టెన్‌గా ఎదిగారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ తరపున ఆడుతూ అనేక విజయాలను అందించారు. క్రీడల పట్ల ఆమెకున్న అంకితభావం, పట్టుదలే నేడు ఆమెను దేశ రాజధానిలో జరిగే అత్యున్నత వేడుకలకు అతిథిగా నిలబెట్టాయి.

అదృష్టంగా భావిస్తున్నానన్న దీపిక
రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందడంపై దీపిక తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. “దేశ ప్రథమ పౌరురాలి నుంచి పిలుపు రావడం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి. ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలను కళ్లారా తిలకించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ గౌరవం నా బాధ్యతను మరింత పెంచింది” అని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Also Read: బంగారం కొందామనుకుంటున్నారా? అయితే ఈ షాకింగ్ న్యూస్ మీ కోసమే!

జిల్లా వ్యాప్తంగా ఆనందం..
శ్రీ సత్యసాయి జిల్లా నుంచి ఒక సామాన్య రైతు బిడ్డకు ఈ స్థాయి గుర్తింపు రావడం పట్ల జిల్లా యంత్రాంగం, క్రీడా అభిమానులు గర్వపడుతున్నారు. దీపిక సాధించిన ఈ విజయం గ్రామీణ ప్రాంతాల్లోని ఎంతో మంది ప్రతిభావంతులైన క్రీడాకారులకు మార్గదర్శకంగా నిలుస్తుందని ప్రముఖులు కొనియాడుతున్నారు. 26న ఢిల్లీ వెళ్లనున్న దీపికకు గ్రామస్థులు క్రీడా సంఘాలు ఘనంగా వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్నాయి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×