// // Andhra Pradesh Scretariat office - మంత్రులు, అధికారుల పేషీల్లో కోవర్టులు..? -->
E-Paper
Advertisement

AP CMO: మంత్రులు, అధికారుల పేషీల్లో కోవర్టులు.. ?

AP CMO: మంత్రులు, అధికారుల పేషీల్లో కోవర్టులు.. ?
Advertisement

AP CMO: ఏపీలో ప్రభుత్వ అనుమతి లేకుండా జీపీఎస్ జీవో, గెజిట్ విడుదల అంశానికి సంబంధించి సీఎంవో పూర్తి సమాచారాన్ని సేకరిస్తుంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో విచారణను ప్రారంభించారు. ఆర్థిక శాఖ, న్యాయశాఖల్లో పనిచేసే వాళ్లలో ఎవరు దీనికి కారకులనే దిశగా విచారణ చేస్తున్నారు. ఆర్థికశాఖలో ఓ అధికారి, న్యాయశాఖలో మరో ఆఫీసర్ పాత్రలపై ఆరా తీస్తున్నారు. ఈ ఇద్దరు అధికారుల గత చరిత్రపై కూడా ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

ఈ అధికారులిద్దరూ బిజినెస్ రూల్స్ పాటించారా..? లేదా? అనే కోణంలో విచారిస్తున్నారు. బిజినెస్ రూల్స్ ఉల్లంఘన జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. చివరి ఆరు నెలల్లో పాత ప్రభుత్వంలో అమలు కాని నిర్ణయాల ఫైళ్లను కొత్త ప్రభుత్వం ముందు ఉంచాలని నిబంధనలు చెబుతున్నాయని.. అమలులో లేని పాత ప్రభుత్వ నిర్ణయాల అమలుకు కొత్త ప్రభుత్వ అనుమతి తప్పనిసరని బిజినెస్ రూల్స్‌లో ఉంటుందని సచివాలయ వర్గాలు వెల్లడిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Also Read: ఏపీలో మూడు చోట్ల కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు.. ఎక్కడెక్కడ అంటే?

చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు జీవో జారీ చేయడం సరిగ్గా నెల రోజుల తరువాత గెజిట్ అప్‌లోడ్ చేయడం వెనుక ఏమైనా కుట్ర దాగి ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలు శాఖల్లో, మంత్రులు, అధికారులో పేషీల్లో ఇంకా ఎవరైనా కోవర్టులున్నారా ? అనే కోణంలో ప్రభుత్వం ఆరా తీస్తుంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×