E-Paper
Advertisement

Inter Students in AP: ఏపీలో ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక.. ఏప్రిల్ ఒకటి నుంచి క్లాసులు ప్రారంభం

Inter Students in AP: ఏపీలో ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక.. ఏప్రిల్ ఒకటి నుంచి క్లాసులు ప్రారంభం
Advertisement

Inter Students in AP: ఇంటర్మీడియట్ విద్యా విధానంలో కీలక మార్పులు చేసింది ఏపీ ప్రభుత్వం. అందుకు అనుగుణంగా అధికారులు అడుగులు వేస్తున్నారు. తాజాగా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అకడమిక్ క్యాలెండర్‌ని విడుదల చేసింది ఇంటర్ బోర్డు. దీని ప్రకారం ఏప్రిల్ ఒకటి నుంచి విద్యార్థులకు తరగతులు మొదలుకానున్నాయి.

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక

Advertisement

ఇంటర్ విద్యావిధానంలో కీలక మార్పులు చేసింది ఏపీ ప్రభుత్వం. దీని ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్ బోర్డు  కార్యదర్శి రంజిత్ బాషా విడుదల చేశారు. క్యాలెండర్ ప్రకారం ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఏప్రిల్ ఒకటి నుంచి తరగతులు మొదలు కానున్నాయి.

ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ను అమలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. క్యాలెండర్‌లో షెడ్యూల్ ప్రకారం ఇంటర్ తొలి ఇయర్ పరీక్షలు రాసిన స్టూడెంట్స్‌కు సెకండియర్ క్లాసులు ఏప్రిల్ 1 నుంచి 23 జరగనున్నాయి. ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు సమ్మర్ సెలవులు ఉండనున్నాయి. మళ్లీ జూన్ ఒకటి నుంచి కళాశాలలు పూర్తి స్థాయిలో పునఃప్రారంభమవుతాయి.

Advertisement

ఏప్రిల్ ఒకటి నుంచి ఇంటర్ సెకండియర్ క్లాసులు ప్రారంభం

ఏడాదిలో 232 రోజులు కళాశాలలు పని చేయనున్నాయి. ఇక దసరా సెలవులను అక్టోబరు 10 నుంచి 20 వరకు ఉంటాయి. సంక్రాంతి సెలవులను 2027 జనవరి 9 నుంచి 17 వరకు ఉంటాయి. త్రైమాసిక పరీక్షలు అక్టోబరు 5 నుంచి 9 వరకు జరుగుతాయి. అర్ధ సంవత్సర పరీక్షలు నవంబరు 25 నుంచి 30 మధ్య జరుగుతాయని తెలిపింది.

ప్రీ ఫైనల్ పరీక్షలు 2027 జనవరి 19 నుంచి 23 వరకు జరగనున్నట్లు తెలియజేసింది బోర్డు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో ప్రాక్టికల్స్, థర్డ్ వీక్‌ నుంచి పబ్లిక్ పరీక్షలు ఉంటాయని క్యాలెండర్‌లో పేర్కొంది. విద్యార్థుల అడ్మిషన్ల కోసం ప్రైవేట్ కళాశాలలు చేస్తున్న తప్పుడు ప్రచారాలపై వార్నింగ్ ఇచ్చింది.

ALSO READ: తెలుగు ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి, చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు

పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత లేదా ర్యాంకుల హామీ ఇస్తూ ప్రచారం చేయడం ముమ్మాటికీ చట్ట విరుద్ధమని తెలిపింది. ఈ నేపథ్యంలో హోర్డింగులు, కరపత్రాలు, గోడలపై రాతలు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రకటనలను నిషేధించింది. ఈ నియమాలను అమలు చేయకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×