E-Paper
Advertisement

Inter Exams IN AP: ఏపీలో ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ! 10 లక్షల మందికి పైగానే

Inter Exams IN AP: ఏపీలో ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ! 10 లక్షల మందికి పైగానే
Advertisement

Inter Exams IN AP: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీయట్ పరీక్షలు-2026 సోమవారం నుంచి మొదలయ్యాయి.  మార్చి 24 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల కోసం ఏపీ వ్యాప్తంగా 1,500 లకు పైగానే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఈసారి 10.57 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.

ఏపీలో ఇంటర్ పరీక్షలు.. 10.57  లక్షల మంది హాజరు

Advertisement

ఏపీ వ్యాప్తంగా సోమవారం నుంచి ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. దాదాపు 10.57 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. అందులో 5.31 లక్షల మంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. మరో 5.26 లక్షల మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 1,537 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఇంటర్ సెకండియర్ పరీక్షలు మంగళవారం నుంచి జరుగుతాయి. విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్‌కు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని ఇప్పటికే బోర్డు ప్రకటించింది. విద్యార్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచన చేశారు అధికారులు. పరీక్షలు జరిగే అన్ని గదు­ల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు.

Advertisement

ఓ నిఘా కెమెరాలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

ఉమ్మడి కృష్ణా జిల్లా ఈసారి సుమారు 1.02 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. 56 వేల మంది విద్యార్థులు ఫస్టియర్ విద్యార్థులు కాగా, 46 వేల మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. గతేడాది ఈ జిల్లా రాష్ట్రంలో అత్యధికంగా 90 శాతం పైగా ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించింది.

ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 150కి పైగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. పరీక్ష కేంద్రాల్లో మొబైల్ ఫోన్‌లు, స్మార్ట్ వాచ్‌లు, కాలిక్యులేటర్ వంటి గాడ్జెట్స్‌ని దూరంగా పెట్టారు. పరీక్షలు జరిగే కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది.ఇప్పటికే అధికారులు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ALSO READ: పోస్టల్ వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం.. వాట్సప్ గవర్నెన్స్‌తో అనుసంధానం

ఎండలు మొదలు కావడంతో ప్రతి కేంద్రంలో తాగునీరు, ప్రాథమిక చికిత్స సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పరీక్షల సందేహాల కోసం ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసింది ఇంటర్ బోర్డు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేకంగా టోల్‌ ఫ్రీ నెంబర్ 1800–425–1531 సంప్రదించవచ్చు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×