// // Nara Lokesh Tweet - ఏపీ పెట్టుబడులపై నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్.. -->
E-Paper
Advertisement

Nara Lokesh Tweet: ఏపీ పెట్టుబడులపై నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్..

Nara Lokesh Tweet: ఏపీ పెట్టుబడులపై నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్..
Advertisement

Nara Lokesh Tweet: ఏపీలో పెట్టుబడులపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్‌ వేధికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం తెచ్చిన స్థానికులకు ఉద్యోగాలు అనే చట్టంపై జరుగుతున్న వివాదంపై లోకేష్ స్పందించారు. కర్ణాటకలో కొత్త చట్టంపై ఇన్వెస్టర్లు, బిజినెస్ మ్యాన్స్, నాస్కాం వంటి ఆర్గనైజేషన్స్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయని లోకేష్ తెలిపారు. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా కర్ణాటక చట్టంపై చర్చ మొదలైన నేపథ్యంలో ఆ పరిణామాలను అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.

నాస్కాం ట్వీట్ రీ ట్వీట్ చేస్తూ ఏపీలో పెట్టుబడులపై లోకేష్ ట్వీట్ చేసారు. ఇన్వెస్టర్ల ఆవేదన , అభ్యంతరాలు తాను అర్థం చేసుకుంటానని అన్నారు. ఏపీలో ఎటువంటి ఆంక్షలు, ఇబ్బందులు ఉండవని, పెట్టుబడులు పెట్టొచ్చంటూ ఓపెన్ ఇపర్ ఇచ్చారు. ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, డాటా సెంటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వంటి రంగాల్లో విశాఖలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానం పలికారు. ఏపీ ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు, నిబంధనలు పెట్టదని.. ప్రభుత్వం నుంచి పూర్తి సహాకారం ఉంటుందని అన్నారు.

Advertisement

ఉత్తమ పాలసీలు, మౌళిక సదుపాయాలు, నిరంతర విద్యుత్‌తో పెట్టుబడులకు అనుకూలత వాతావరణం కల్పిస్తామని లోకేష్ అన్నారు. నిపుణులైన యువత, మానవ వనరులు ఏపీలో పుష్కలంగా ఉన్నాయని పెట్టుడులు పెట్టాలని నారా లోకేష్ పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ పారిశ్రామిక సంస్థలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి.

Also Read: అసెంబ్లీ సమావేశాల తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ

Advertisement

దాదాపు 75 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులతో రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసేందుకు దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ముందుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో పాటు మరిన్ని పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి నారా లోకేష్ ఈ బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాష్ట్రంలో 4వేల కోట్ల పెట్టుబడులు పెడతామంటూ వియత్నాం ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో పేరున్న విన్ ఫాస్ట్ కంపెనీ సీఈఓ తెలిపారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×