E-Paper
Advertisement

AP Weather Report: మండే ఎండల్లో ఏపీకి కూల్ న్యూస్.. రాబోయే మూడు రోజులు వర్షాలు..!

AP Weather Report: మండే ఎండల్లో ఏపీకి కూల్ న్యూస్.. రాబోయే మూడు రోజులు వర్షాలు..!
Advertisement
AP Weather
AP Weather

Rain Alert for Andhra Pradesh State: ఎండలతో మండిపోతున్న ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లని కబులు చెప్పింది. ఉత్తర కోస్తాంధ్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనాసాగుతోందని వెల్లడించింది.

ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో రాబోయే మూడు రోజులు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుండడంతో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మాత్రం మరో రెండు రోజుల పాటు వేడి వాతావరణం, తేమతో కూడిన వాతావరణం కొనసాగుతోందని తెలిపింది. ఈ ద్రోణి ప్రభావం కారణంగా రానున్న రెండుమూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

ప్రస్తుతం రాష్ట్రంలోని నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో అత్యధికంగా 42.79 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. కడప, అనందపురం, తాడిపత్రి, పొద్దుటూరు, పాణ్యంలో 42.70 ఉష్ణోగ్రతలు, ఒంటిమిట్ట, సూళ్లూరుపేట, గుంతకల్ లో 42 డిగ్రీలు.. శ్రీకాకుళం, అనకాపల్లి, బాపట్ల, విజయనగరం జిల్లాల్లో 36 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

Also Read: Shamanthakamani resign: వైసీపీకి గుడ్ బై.. మా వల్ల కాదు..!

Advertisement

తెలంగాణలో భిన్న పరిస్థితులు..
తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో సోమవారం వడగాల్పులు వీస్తే.. మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసాయి. మంగళవారం కూడా పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

మంగళవారం కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటుగా గంటకుల 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×