E-Paper
Advertisement

Husband: ఫస్ట్‌ నైట్ వీడియో సోషల్ మీడియాలో.. అప్‌లోడ్ చేసిన శాడిస్ట్ మొగుడు..

Husband: ఫస్ట్‌ నైట్ వీడియో సోషల్ మీడియాలో.. అప్‌లోడ్ చేసిన శాడిస్ట్ మొగుడు..
Advertisement

Husband: ఈమధ్య మనుషుల్లో పైశాచికత్వం బాగా పెరిగిపోతోంది. కామం రెక్కలు విరుచుకుంటోంది. ప్రేమ పేరుతో వేధింపులు, హత్యలు, దారుణాలు పెరిగిపోతున్నాయి. ఇదంతా ఓ టైపు అరాచకమైతే.. ఈ న్యూస్ ఇంకో రకం శాడిజం.

ఓ శుభముహూర్తాన వాళ్లిద్దరికి పెళ్లైంది. ఇంకో మంచి ముహూర్తం చూసి.. శోభనం ఏర్పాటు చేశారు. సక్సెస్‌ఫుల్‌గా తొలిరాత్రి ముగిసింది. అలా అలా కొన్ని రోజులు గడిచాయి. కట్ చేస్తే.. ఓ బ్యాడ్ డే సంచలన విషయం తెలిసింది. ఆ విషయం తెలిసి భార్య షాక్ అయింది. సిగ్గుతో చచ్చినంత పనైంది. భర్తపై విపరీతమైన కోపం వచ్చింది. విషయం పేరెంట్స్‌కు చెప్పగా ఆ శాడిస్ట్ భర్తను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు పోలీసులు. ఇంతకీ అసలేం జరిగిందంటే…

Advertisement

కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని ఓ తీరగ్రామంలో జరిగిందీ దారుణం. గత నెల ఫిబ్రవరి 8న ఆ యువకుడి(20)కి అదే గ్రామానికి చెందిన బాలిక(17)తో వివాహమైంది. అదే రోజు ఫస్ట్ నైట్ జరిగింది. కానీ, కొన్నిరోజులకే వారి తొలిరాత్రి దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. వారి ఏకాంత కార్యమంతా ఆ వీడియోలో రికార్డైంది. అంతే. ఆ భార్యకు దిమ్మతిరిగి పోయింది. తామిద్దరమే ఉన్న గదిలో జరిగిన దృశ్యాలను ఎవరు రికార్డు చేసినట్టు? తమ గదిలోకి మూడో వ్యక్తి వచ్చే ఛాన్సే లేదు? మరి ఇంకెవరు ఈ పని చేసినట్టు? ఆమె అనుమానమే నిజమైంది. భర్తే ఈ దారుణానికి కారణమని తెలిసింది. ఫస్ట్ నైట్ శృంగారతంతు మొత్తం సెల్‌ఫోన్‌లో రికార్డు చేశాడు ఆ శాడిస్ట్ మొగుడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో కలకలం మొదలైంది. ఆ వీడియో వైరల్ అయి భార్య కంట పడటంతో విషయం వెలుగు చూసింది.

జరిగిన దారుణంపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఆమె పోలీసుల దగ్గరకు వెళ్లకుండా ఆ భర్త కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. గ్రామపెద్దలతో ప్రైవేటు పంచాయితీ చేసి.. మేటర్‌ను సైలెంట్‌గా క్లోజ్ చేయాలని చూశారు. కానీ, ఆ బాలిక తల్లి వారి ఒత్తిడికి లొంగకుండా.. పోలీసులనే ఆశ్రయించింది. ఆ సైకో భర్తను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా.. 14 రోజుల రిమాండ్‌ పడింది. ఈ విషయం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×