E-Paper
Advertisement

AP News: భార్యను చంపేసి, దండేసి.. భర్త ఘాతుకం..

AP News: భార్యను చంపేసి, దండేసి.. భర్త ఘాతుకం..
Advertisement

AP News: అనుమానం.. దారుణానికి పురిగొల్పింది. బ్యూటీపార్లర్ నడుపుతున్న భార్య క్యారెక్టర్ ను శంకించాడు ఆమె భర్త. రోజూ అందంగా రెడీ అయి వెళుతుండటంతో మరింత అనుమానం పెంచుకున్నాడు. ఎవరితోనో ఏదో సంబంధం ఉందనే అపోహతో భార్యను వేధించడం మొదలుపెట్టాడు. వారిద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. అవి మరింతగా పెరిగాయి. ఆ భర్త ఉన్మాదిగా మారాడు. భార్యపై దారుణానికి తెగబడ్డాడు.

గుంటూరు జిల్లా తెనాలి, గాంధీనగర్‌లో జరిగిందీ దారుణం. కుటుంబ కలహాలతో భార్య గొంతుకోసి చంపేశాడు భర్తు. అనంతరం పూలదండ వేసి.. నివాళులు అర్పించి.. పోలీసులకు లొంగిపోవడం కలకలం రేపింది.

Advertisement

తెనాలికి చెందిన కోటయ్య, స్వాతి (31)లకు ఇద్దరు పిల్లలు. స్వాతి బ్యూటీపార్లర్‌ నిర్వహిస్తోంది. కొంతకాలంగా ఆమె ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు కోటయ్య. ఇదే విషయంలో రెండు రోజులుగా ఇద్దరి మధ్య బాగా గొడవ జరుగుతోంది. గురువారం మధ్యాహ్నం ఫుల్ గా మద్యం తాగిన కోటయ్య.. ఒక్కసారిగా సైకోగా మారాడు. భార్యను చంపాలని డిసైడ్ అయ్యాడు.

కత్తి, పూలదండ కొన్నాడు. భార్య నడిపిస్తున్న బ్యూటీ పార్లర్ కు వచ్చాడు. భార్యతో మరోసారి గొడవ పడ్డాడు. కోపంతో ఊగిపోతూ.. వెంట తెచ్చుకున్న కత్తితో భార్య మెడ, వీపు, చేతి భాగంలో విచక్షణారహితంగా దాడి చేశాడు. భర్త దాడిలో తీవ్రంగా గాయపడిన స్వాతి.. స్పాట్ లోనే చనిపోయింది. బ్యూటీపార్లర్ అంతా రక్తపు మడుగుగా మారింది.

Advertisement

అక్కడితో ఆగలేదు ఆ ఉన్మాది భర్త. చనిపోయిన భార్యకు పూలదండ కూడా వేసి నివాళులు అర్పించాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి సరెండర్ అయ్యాడు. తెనాలిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×