E-Paper
Advertisement

Minister Anitha: ఆట విడుపు కోసం.. ఆహా ఏమి రుచి అంటూ మంత్రి అనిత

Minister Anitha: ఆట విడుపు కోసం.. ఆహా ఏమి రుచి అంటూ మంత్రి అనిత
Advertisement

Minister Anitha: తీరిక లేని పనుల్లో బిజీగా ఉన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. కాస్త రిలాక్స్ కోసం ఫేమస్ టీ స్టాల్‌ను సందర్శించి సర్‌ప్రైజ్ ఇచ్చారు. టీ తయారీ చేయడాన్ని పరిశీలించిన ఆమె స్వయంగా తయారు చేశారు. అనంతరం రుచి చూసి ‘ఆహా.. ఏమి రుచి’ అంటూ నిర్వాహకులతో ముచ్చటించారు.

హోం మంత్రి అనిత ఆదివారం రాత్రి ఎంవీపీ కాలనీలో సందడి చేశారు. ఎంవీపీ కాలనీలో ఫేమస్ ‘వైజాగ్ దమ్ టీ స్టాల్‌’ని విజిట్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు. కంచుపాత్రలోని చిన్న కుండలో ప్రత్యేకంగా టీ తయారీ చేయడాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ఆమె స్వయంగా టీని తయారు చేశారు.

Advertisement

అనంతరం రుచి చూసి ఆహా ఏమి రుచి అంటూ నిర్వాహకులతో ముచ్చటించారు . దాదాపు అరగంట సేపు ఎంవీపీ కాలనీలోని టీ స్టాల్ వద్ద మంత్రి గడిపారు. అనుకోని అతిథిలా వచ్చిన హోంమంత్రికి నిర్వాహకులు థాంక్స్ చెప్పారు.

స్థానికులతో వివిధ అంశాలపై హోం మంత్రి అనిత ముచ్చటించారు. రోడ్లు ఎలా ఉన్నాయంటూ స్థానికుల నుంచి సమాధానాలు అడిగి తెలుసుకున్నారు. కొంతమంది తమ సమస్యలు చెప్పినట్టు తెలుస్తోంది. గడిచిన ఐదేళ్లుగా ఇలాంటి సన్నివేశాలను తాము చూడలేదని, స్వయంగా మంత్రి రావడం ఆనందంగా ఉందని అంటున్నారు.

Advertisement

Minister Anitha visit Tea Stall (Credit TDP Twitter)

Minister Anitha visit Tea Stall (Credit TDP Twitter)

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×