E-Paper
Advertisement

Home minister Anita : వైసీపీ నేతలను గడగడలాడించిన హోం మినిస్టర్.. మాస్ వార్నింగ్‌తో దడ పుట్టించారుగా!

Home minister Anita : వైసీపీ నేతలను గడగడలాడించిన హోం మినిస్టర్.. మాస్ వార్నింగ్‌తో దడ పుట్టించారుగా!
Advertisement

Home minister Anita : వైసీపీ అండచూసుకుని అప్పట్లో తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత టోటల్ గా ఆ పార్టీ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చి పడేశారు. మంగళవారం టీటీడీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్ సీపీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి వైకాపా ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ బ్రష్టుపట్టిపోయాయని ..వాటన్నింటినీ గాడిలో పెట్టే పనిలో ఉన్నామని తెలిపారు. గత ఐదేళ్లుగా ఎన్నో అత్యాచారాలు, హత్యలు, ఆర్థిక నేరాలు జరిగాయని వాటిపై జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

తప్పులన్నీ మీవే

Advertisement

నిరంతరం తప్పులు చేసే వైసీపీ నేతలకు తాము సమాధానం చెప్పవలసిన అవసరం లేదని అనిత స్పష్టం చేశారు. తమని ఓట్లేసి గెలిపించిన ప్రజలకే తాము జవాబుదారీగా ఉంటామని అన్నారు. వైఎస్ఆర్ సీపీ పాలనలో రాష్ట్రంలో ఎక్కడా కూడా సీసీ కెమెరాలు పనిచేయలేదని ఆరోపించారు. టోటల్ గా పోలీసు యంత్రాంగాన్నే నిర్వీర్యం చేసిన ఘనత జగన్ దే నన్నారు.

ALSO READ : ఒక్క స్కీమ్ కే రూ.13వేల కోట్ల భారం.. మిగిలిన వాటి సంగతేమిటి? ఫ్రీ బస్ ఉందా.. లేదా?

Advertisement

వ్యవస్థను గాడిలో పెడుతున్నాం

పోలీసు వ్యవస్థను మళ్లీ సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కోట్లు ఖర్చుచేయాల్సి వచ్చిందని అన్నారు. వైసీపీ నేతలు పబ్లిక్ గా గంజాయి పండించి కోట్లు గడించారని అన్నారు. జగన్ కు అసలు ప్రత్యేక కోర్టు అంటే తెలుసా అన్నారు. అప్పటి ప్రభుత్వ హయాంలో నేరస్థులు యథేచ్ఛగా నేరాలు చేసి ఆరు నెలల దాకా అస్సలు దొరికేవారు కాదని అన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందని.. నేరం జరిగిన 24 గంటలలోపే నిందితులను పట్టుకుని పోలీసులు తమ సత్తా చాటుతున్నారని అన్నారు. ఆయన ప్రభుత్వ హయాంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే పరామర్శించని నేత ఇప్పుడు మాత్రం పరామర్శించడానికి రావడంలో అర్థం లేదని హోం మంత్రి వంగలపూడి అనిత జగన్ తీరును దుయ్యబట్టారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×