E-Paper
Advertisement

Hero Balakrishna Assets: “మా బాలయ్య బంగారం”.. అఫిడవిట్ లో ఆస్తులు, అప్పుల వివరాలివిగో!

Hero Balakrishna Assets: “మా బాలయ్య బంగారం”.. అఫిడవిట్ లో ఆస్తులు, అప్పుల వివరాలివిగో!
Advertisement

Balakrishna Assets Details in Affidavit: హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ.. శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య.. ముచ్చటగా మూడోసారీ విజయం కోసం ప్రచారం చేస్తున్నారు. కాగా.. తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్ లో బాలయ్య తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఈ వివరాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలయ్యబాబు చెప్పిన ఆస్తుల వివరాలిలా ఉన్నాయి.

ఆయన పేరుమీద ఉన్న ఆస్తుల విలువ రూ.81 కోట్ల 63 లక్షలు ఉంటుందని అఫిడవిట్ లో పేర్కొన్న బాలయ్య.. భార్య వసుంధర ఆస్తుల విలువ రూ.140 కోట్ల 38 లక్షల 83 వేలు ఉంటుందని తెలిపారు. కొడుకు మోక్షజ్ఞ ఆస్తుల విలువ 58 కోట్ల 63 లక్షల 66 వేల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. ఇక అప్పుల విషయానికొస్తే.. బాలయ్యకు రూ.9కోట్ల 9 లక్షల 22వేలు, వసుంధరకు రూ.3 కోట్ల 83 లక్షల 98 వేలు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు.

Advertisement

లిక్విడ్ క్యాష్.. బాలకృష్ణ అకౌంట్ లో కోటిరూపాయల 74 లక్షల 42వేల 237 రూపాయలు ఉన్నట్లు తెలిపారు. కోటి రూపాయల 52 లక్షల విలువైన కార్లు, 3 లక్షల 70 వేల 140 రూపాయల విలువైన 5 కేజీల వెండి, 44 లక్షల విలువ చేసే బంగారం, 68 లక్షల విలువైన డైమండ్స్ ఉన్నట్లు వివరంగా చెప్పారు.

Also Read: బంగారం లేని బాబు.. కేసులు 20కి పైగానే!

Advertisement

భార్య వసుంధర పేరుపై ఏకంగా 4 కోట్ల రూపాయల 79 లక్షల 16 వేల 752 రూపాయల విలువైన బంగారం, వెండి, డైమండ్ నగలున్నట్లు వెల్లడించారు బాలయ్య. మొత్తంమీద బాలయ్య ఫ్యామిలీ ఆస్తులు రూ.280 కోట్లకు పైమాటే. ఏదేమైనా మా బాలయ్య బాబు బంగారం అంటున్నారు అభిమానులు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×