// // High Tension In Tadipatri| తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్‌.. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్ -->
E-Paper
Advertisement

High Tension In Tadipatri: తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్‌.. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్

High Tension In Tadipatri: తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్‌.. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్
Advertisement

వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయం వేడుక్కుతోంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే తాడిపత్రికి పెద్దారెడ్డి వస్తే అడ్డుకుంటామని టీడీపీ నేతలు, కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో పోలీసులు తాడిపత్రిలో భారీగా మోహరించారు. పెద్దారెడ్డిని తాడిపత్రి రావద్దని జిల్లా ఎస్పీ జగదీష్ కోరినట్లు సమాచారం. అయితే పెద్దారెడ్డి మాత్రం తాను తాడిపత్రికి వెళ్లి తీరుతానని పట్టుబట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో పెద్దారెడ్డి తాడిపత్రికి బయల్దేరితే తిమ్మంపల్లిలోనే హౌస్ అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధం అయ్యారు. అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.

Advertisement

Also Read: హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ కైవసం, ఛైర్మన్‌గా రమేష్ ఎన్నిక

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని జేసీ అనుచరలు తాడిపత్రికి రానివ్వకుండా అడ్డుపడుతున్నారంటూ.. గత కొన్ని రోజులుగా వాదనలు జరుగుతున్న నేపథ్యంలో.. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఖచ్చితంగా తాడిపత్రి వెళ్లొచ్చు అంటూ హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి అనుచరులతో కలిసి తాడిపత్రి వెళ్లడానికి సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. తాను వెళ్లి తీరాల్సిందే అంటూ వాగ్వాదానికి దిగనట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం. జేసీ అనుచరులు మాత్రం జై జేసి జై జేసి అంటూ నినాదాలు చేశారు. ఖచ్చితంగా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి వెళ్లనివ్వం అని తేల్చి చెబుతున్నారు. గతంలో పెద్దారెడ్డి జేసీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు జేసీ అనుచరులు దాడి చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×