E-Paper
Advertisement

TDP vs YCP: మండలాఫీసులో ప్రజాప్రతినిధుల భేటీ.. అడ్డుకున్న కూటమి కార్యకర్తలు, ఆపై ఉద్రిక్తత

TDP vs YCP: మండలాఫీసులో ప్రజాప్రతినిధుల భేటీ.. అడ్డుకున్న కూటమి కార్యకర్తలు, ఆపై ఉద్రిక్తత
Advertisement

TDP vs YCP: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరునెలలు గడిచిపోయింది. అయినా దిగువ స్థాయిలో కార్యకర్తల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. లేటెస్ట్‌గా ఉమ్మడి చిత్తూరు జిల్లా ములకల చెరువు ప్రాంతంలో గురువారం మండల సమావేశానికి ముందు కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది.

మండల కార్యాలయంలో భేటీ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అదే సమయంలో సమావేశం నిర్వహించకూడదంటూ కూటమి నేతలు నిరసన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మండల సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకుంటామన్నారు తెలుగు తమ్ముళ్లు. దీంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్దానికి దారితీసింది.

Advertisement

చివరకు ఘర్షణకు దారి తీసింది. ఇరు పార్టీల నేతలు మండల కార్యాలయానికి రాగానే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మోహరించి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో అల్లర్లుకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో పడ్డారు.

పోలీసులు దగ్గరుండి మండల ప్రజాప్రతినిధులను లోపలకు పంపారు. గత ఐదు సంవత్సరాలుగా ఏనాడు సమావేశంలో జరపలేదని, ఇప్పుడు వైసీపీ నేతలు సర్వసభ్య సమావేశం పెట్టడంపై మండిపడ్డారు టీడీపీ నేతలు. పోలీసులు జోక్యంతో ప్రస్తుతం ప్రశాంత పరిస్థితులు ఏర్పడినట్టు కనిపిస్తున్నాయి.

Advertisement

ALSO READ:  జేసీ దివాకర్ రెడ్డి బస్సులు కాలిపోయినయ్.. కావాలనే చేశారా..?

మరోవైపు ములకల చెరువు మండలం సర్వసభ్య సమావేశంలో ఎంపీడీవో‌తో వాగ్వాదానికి దిగారు వైకాపా ఎంపీటీసీలు ,జడ్పిటీసీలు. సమావేశం మినిట్స్ బుక్కున లాక్కున్నారు వైకాపా ఎంపీటీసీలు. సమావేశం నిర్వహించు కుండా ఇన్నాళ్లు ఏం చేశారంటూ ఎంపీడీవోను అసభ్య పదజాలంతో దూషించారట. అధికారులు సంతకాలు పెట్టడంపై అభ్యంతరం తెలిపారు. చివరకు ఎంపీడీవో చాంబర్లు ఎంపీడీవోని చుట్టుముట్టారు వైకాపా ఎంపీటీసీలు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×