E-Paper
Advertisement

Fishermen Vs Police: హై టెన్షన్.. అనకాపల్లి హైవే క్లోజ్! మత్స్యకారులు Vs పోలీసులు

Fishermen Vs Police: హై టెన్షన్.. అనకాపల్లి హైవే క్లోజ్! మత్స్యకారులు  Vs పోలీసులు
Advertisement

Fishermen Vs Police: అనకాపల్లి జిల్లా నక్కపల్లి హైవే దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బల్క్ డ్రగ్స్ పార్కు నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని మత్స్యకారులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతంగా మారింది. రహదారికి ఇరువైపుల నిరసనకి దిగడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వాళ్లని వదిలిపెట్టాలని రామ చంద్ర యాదవ్ వచ్చేందుకు పోలీసులు అనుమతి అవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మత్స్యకారులతో చర్చించేందుకు పోలీసు, రెవెన్యూ అధికారులు జాతీయ రహదారి వద్దకి  చేరుకుంటున్నారు.

అక్కడి నక్కపల్లి తహశీల్దార్ కార్యాలయం సమీపంలో.. ఆందోళనల తీవ్రత ఎక్కువయి, జిల్లా కలెక్టర్ విజయం కృష్ణన్ వీడియో కాల్ ద్వారా మాట్లాడి నిర్ణయాలపై చర్చించే ప్రయత్నం చేయగా, మత్యకారులు కలెక్టర్ వచ్చే వరకు ఉద్యమాన్ని ఆపమని నిరాకరించారు. సుమారు 10 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది.

Advertisement

మత్యకారులకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్, సీపీఎం నాయకుడు అప్పలరాజును పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై నిరసనకారులు తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నాయకుల రాకను అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని ఆరోపించారు. దీంతో ఆందోళన మరింత ఉధృతమైంది.

మత్యకారులు నక్కపల్లి ఎస్‌ఐ సన్నిబాబును వెంటనే సస్పెండ్ చేయాలని, హోం మంత్రి వంగలపూడి అనిత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Also Read: పాడుబడ్డ బంగ్లాలో డ్రగ్స్ తీసుకుంటూ.. ఇద్దరు యువకులు అరెస్ట్

ఉద్రిక్తతతో జాతీయ రహదారిపై 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డు రెండువైపులా లారీలు, బస్సులు, కార్లు నిలిచి ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించే ప్రయత్నం చేసినా, పరిస్థితి అదుపులోకి రాలేదు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×