E-Paper
Advertisement

Vyuham Movie Release : హైకోర్టులో విచారణ వాయిదా.. వ్యూహం రిలీజ్ పై ఉత్కంఠ..

Vyuham Movie Release : హైకోర్టులో విచారణ వాయిదా.. వ్యూహం రిలీజ్ పై ఉత్కంఠ..
Advertisement

Vyuham Movie Release : ఏపీ రాజకీయాలపై రాంగోపాల్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘వ్యూహం’. ఈ మూవీ రిలీజ్ పై ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమాకు ఇచ్చిన సెన్సార్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ న్యాయపోరాటం చేస్తున్నారు. ఆయన వేసిన పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేయడంతో వ్యూహం రిలీజ్ పై సందిగ్ధత ఏర్పడింది.

‘వ్యూహం’ సినిమాకు ఇచ్చిన సెన్సార్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరుతూ నారా లోకేశ్‌ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. మూవీ రిలీజ్ చేయకుండా చిత్ర నిర్మాతను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ విచారణను ఉన్నత న్యాయస్థానం డిసెంబర్‌ 28కి వాయిదా వేసింది.

Advertisement

‘వ్యూహం’ ట్రైలర్‌ రిలీజ్ సమయంలో దర్శకుడు తనకు జగన్‌ అంటే ఇష్టమని చెప్పారని లోకేష్ పిటిషన్ లో ప్రస్తావించారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ నచ్చరని వర్మ చెప్పారని పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ వ్యూహం మూవీని తెరవెనక ఉండి తీయించారని ఆరోపించారు.

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ ప్రాంతీయ కార్యాలయం, రివైజింగ్‌ కమిటీ, రామదూత క్రియేషన్స్‌, ప్రొడ్యూసర్ దాసరి కిరణ్‌ కుమార్‌, డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మను పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు. వ్యూహం డిసెంబర్‌ 29న రిలీజ్ కావాల్సి ఉంది. ఈనేపథ్యంలో డిసెంబర్ 28 హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×