E-Paper
Advertisement

Hidma: మావోయిస్టు హిడ్మా.. స్కెచ్ వేశాడంటే.. మెరుపు దాడులకు కేరాఫ్?

Hidma: మావోయిస్టు హిడ్మా.. స్కెచ్ వేశాడంటే.. మెరుపు దాడులకు కేరాఫ్?
Advertisement

Hidma: హిడ్మా మామూలు మావోయిస్టు కాదు. తక్కువ కాలంలోనే కేంద్రకమిటీ సభ్యుడిగా ఎదిగిన టాప్ కమాండర్. గెరిల్లా దాడుల్లో ఆరితేరిన ఇండియన్ ఛేగువేరా. భద్రతాదళాలను ముప్పుతిప్పలు పెట్టిన ఖతర్నాక్ కామ్రేడ్. భారీ దాడులకు వ్యూహకర్తగా, దండకారణ్యంలో దళాలను ముందుండి నడిపించడంలో ఆరితేరిన నేతగా పేరు పొందారు. హిడ్మాకు.. విలాస్, హిడ్మాల్, సంతోష్ వంటి మారుపేర్లు ఉన్నాయి.

పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ-PLGA. మావోయిస్టు దళాల్లో స్పెషల్ టీమ్. మనకు NSG, బ్లాక్ క్యాట్, కోబ్రా, గ్రేహౌండ్స్ లాంటి పవర్ ఫుల్ విభాగాలు ఎలాగో.. మావోయిస్టుల్లో గెరిల్లా ఆర్మీ అలా. ఆ PLGAకి కమాండరే హిడ్మా. అంటే అర్థం చేసుకోవచ్చు అతనెంత పవర్ ఫుల్లో.

Advertisement

ఎక్కడ దాడి చేయాలో.. ఎలాంటి పేలుడు పదార్థాలు ఏ డైరెక్షన్ లో పేల్చాలో.. ఎలా రిట్రీవ్ అవ్వాలో.. ఇలా పకడ్బందీ గెరిల్లా దాడులు రచించి, అమలు చేయడంలో హిడ్మా ఎక్స్ పర్ట్ అని చెబుతారు. పక్కా ప్లాన్డ్ గా దాడులు చేస్తారు కాబట్టే.. హిడ్మా బృందం చేసిన ఎటాక్స్ లో మావోయిస్టుల వైపు ప్రాణ నష్టం అతితక్కువగా ఉంటుందని అంటారు.

హిడ్మా చేసిన దాడుల్లో పలుమార్లు భద్రతా దళాలు భారీగా ప్రాణ నష్టాన్ని చవిచూశాయి. 2017లో చేసిన ఆ దాడిలో ఒకేసారి 23 మంది సీఆర్పీఎఫ్ బలగాలను చంపేశాడు. 2010లో దంతేవాడ మెరుపు దాడితో 76 మంది సీఆర్పీఎఫ్ బలగాలను మట్టుబెట్టడం వెనుక మాస్టర్ మైండ్ కూడా హిడ్మానే. 2013లో జీరం వ్యాలీలో అంబుష్ అటాక్ చేసి పలువురు కాంగ్రెస్ సీనియర్ లీడర్లను బలిగొన్నాడు.

Advertisement

అతని మిలటరీ ఆపరేషన్స్ కు మెచ్చే.. అత్యంత తక్కువ సమయంలోనే కేంద్ర కమిటీలో హిడ్మాకు స్థానం కల్పించారు మావోయిస్టులు. తెలుగువారు కాకుండా సుక్మా ప్రాంతం నుంచి ఈ స్థాయికి ఎదిగిన తొలి వ్యక్తి హిడ్మా. చురుగ్గా ఉండే హిడ్మా.. చదివింది పదో తరగతే అయినా.. మంచి ఇంగ్లీష్ మాట్లాడుతాడని చెబుతారు. ఒక్క ఇంగ్లీషే కాదు.. మరో నాలుగైదు బాషలు కూడా మాట్లాడుతాడట. హిడ్మా స్వస్థలం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో ఉన్న పూవర్తి గ్రామం. దక్షిణ బస్తర్ ప్రాంతంలోని మురియా తెగకు చెందినవాడు.

హిడ్మా నెట్ వర్క్ ను వీరప్పన్ తో పోల్చుతారు. ఆదివాసి తెగకు చెందిన వాడే కావడంతో.. స్థానికుల నుంచి హిడ్మాకు మంచి మద్దతు ఉండేది. అడవి బిడ్డలతో బలమైన ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొని.. అతను ఉన్న ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల అవతల భద్రతా దళాల కదలికలు కూడా తనకు తెలిసేలా జాగ్రత్తలు తీసుకునేవాడు. ఛత్తీస్‌గడ్‌, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాకు ఈజీగా, త్వరగా చేరుకునే కీలకమైన జంక్షన్‌లో ఉన్న సుక్మా అడవులను అడ్డాగా చేసుకుని హిడ్మా ఏళ్ల పాటు భద్రతా దళాలపై గెరిల్లా దాడులకు పాల్పడ్డాడు.

Also Read: 19 ఏళ్ల అధికారం.. నితీష్‌పై బీహార్ ప్రజల నమ్మకానికి కారణాలు ఇవేనా?

PLGA దాడులతో తీవ్ర ప్రాణ నష్టాన్ని చవిచూసిన భద్రతా బలగాలు.. హిడ్మా కోసం కొంతకాలంగా గట్టి నిఘా వేసి ఉంచారు. అతను ఫలానా ప్రాంతంలో ఉన్నాడని నిర్థారించుకున్నాక.. వేటాడి.. వెంటాడాయి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×