E-Paper
Advertisement

MLA Sridhar: జనసేన ఎమ్మెల్యే వివాదం.. ఎన్‌హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన హర్ష వీణ

MLA Sridhar: జనసేన ఎమ్మెల్యే వివాదం.. ఎన్‌హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన హర్ష వీణ
Advertisement

రైల్వే కోడూరు శాసనసభ్యుడు ఆరవ శ్రీధర్ వ్యవహారంలో తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు హర్ష వీణ జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)ను ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె చేసిన ఫిర్యాదును స్వీకరించిన కమిషన్, కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది.

గత కొంతకాలంగా తనపై జరుగుతున్న అన్యాయంపై పోరాడుతున్న హర్ష వీణ, తాజాగా ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు సమర్పించారు. ఈ నెల 26న ఆమె ఫిర్యాదు చేయగా, కమిషన్ దానిని పరిశీలించి 29వ తేదీన అధికారికంగా రిజిస్టర్ చేసింది. ఈ ఫిర్యాదుకు 186/1/13/2026 అనే కేసు నంబర్‌ను కేటాయించారు. తన వ్యక్తిగత స్వేచ్ఛకు, హక్కులకు భంగం కలుగుతోందని, ఈ విషయంలో జోక్యం చేసుకుని తనకు రక్షణ కల్పించాలని ఆమె కోరారు.

Advertisement

అడ్వకేట్ సాయి కృష్ణ ద్వారా హర్ష వీణ ఈ న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. స్థానిక యంత్రాంగం నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతోనే తాము జాతీయ స్థాయి కమిషన్‌ను ఆశ్రయించినట్లు బాధితురాలు పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ ప్రమేయం ఉన్న ఈ వ్యవహారంలో నిష్పక్షపాతంగా విచారణ జరగాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

హర్ష వీణ ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ గా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, సమగ్ర నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కమిషన్ ఆదేశించినట్లు బాధితురాలి తరపు న్యాయవాది సాయి కృష్ణ మీడియాకు వెల్లడించారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు ప్రాథమికంగా భావించిన కమిషన్, తదుపరి చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరినట్లు సమాచారం.

Advertisement

ఈ పరిణామం ఇప్పుడు ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యేపై నేరుగా జాతీయ కమిషన్‌లో కేసు నమోదు కావడం సంచలనం సృష్టిస్తోంది. న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని బాధితురాలు హర్ష వీణ వ్యక్తం చేశారు.

ALSO READ: Koti Robbery: మాటు వేసి పక్కా ప్లాన్ తో.. కోఠి కాల్పుల ఘటనలో సీసీటీవీ వీడియో

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×