E-Paper
Advertisement

GVMC Council: గీతం భూముల ఇష్యూ.. జీవీఎంసీ కౌన్సిల్‌లో రచ్చ, వైసీపీ, వామపక్షాల కార్పొరేటర్ల ఆందోళన

GVMC Council: గీతం భూముల ఇష్యూ.. జీవీఎంసీ కౌన్సిల్‌లో రచ్చ, వైసీపీ, వామపక్షాల కార్పొరేటర్ల ఆందోళన
Advertisement

GVMC Council: గీతం భూముల వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటోంది వైసీపీ. ఈ నేపథ్యంలో ఆ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేయాలని డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రారంభమైన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకునేందుకు వైసీపీతోపాటు వామపక్షాల కార్పొరేటర్లు తీవ్ర ప్రయత్నం చేశారు. పలువురు సభ్యులను మేయర్ సస్పెండ్ చేశారు.

రచ్చయిన జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశం

Advertisement

గీతం యూనివర్సిటీ భూముల క్రమబద్దీకరణ అంశంలో శుక్రవారం జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం దద్దరిల్లింది. భూముల క్రమబద్దీకరణను వెనక్కి తీసుకోవాల్సిందేనంటూ వైసీపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు చేతపట్టి మేయర్ పోడియం చుట్టూ బైఠాయించారు. ఈ క్రమంలో టీడీపీ-జనసేన, వైసీపీ కార్పొరేటర్లు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సమావేశంలో తోపులాటకు దారితీసింది.

తొలుత మరణించిన సభ్యుల సంతాప తీర్మానం తర్వాత చర్చించిస్తామని సమాధానం ఇచ్చారు మేయర్ పీలా శ్రీనివాసరావు. అనంతరం తీర్మానం కొనసాగించారు. అనంతరం సభలో గందరగోళం చోటు చేసుకుంది. కూటమి-వైసీపీ కార్పొరేటర్ల మధ్య తోపులాటకు మొదలైంది. ఈ క్రమంలో మేయర్ తన ఛాంబర్‌కి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ సమావేశాలు మొదలయ్యాయి.  కౌన్సిల్ బయట వామపక్షాలు ఆందోళనకు దిగాయి.

Advertisement

గీతం భూముల ఇష్యూ.. వైసీపీ, వామపక్షాల కార్పొరేటర్ల ఆందోళన

అయినా వైసీపీ సభ్యులు ఆందోళనలు కంటిన్యూ చేశారు. పరిస్థితి గమనించి మేయర్, ముగ్గురు వైసీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. వారిలో డిప్యూటీ మేయర్ కాటమూరి సతీష్, వైసీపీ ఫ్లోర్ లీడర్ సహా మరో సభ్యుడు ఉన్నారు. ఆ తర్వాత కౌన్సిల్‌లో సమావేశం జరక్కుండా 15 అంశాలను ఆమోదిస్తున్నట్లు తెలిపారు మేయర్. ఆ తర్వాత తన ఛాంబర్‌కి వెళ్లిపోయారు. ఆయా భూముల క్రమబద్దీకరణ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదు.

కౌన్సిల్ లో జరిగిన వ్యవహారంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ చరిత్రలో ఇవాళ చీకటి రోజుగా వర్ణించారు. చట్టాలను చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా మేయర్,కూటమి కార్పొరేటర్లు ప్రవర్తించిన తీరు రాజ్యాంగబద్ధంగా లేదన్నారు. వైసీపీకి చెందిన పదిమంది సభ్యులను కొట్టడం వల్ల గాయాలు అయ్యాయని తెలిపారు.

ALSO READ: ప్చ్.. పవన్ కళ్యాణ్ టైమ్ బాగోలేదు, వాళ్లకు ఛాన్స్ దొరికిందిగా!

కేవలం సీఎం చంద్రబాబు బంధువుకి 5వేల కోట్ల రూపాయల భూములను కట్టబెట్టడానికి తీర్మానాల్లో పెట్టి బలవంతంగా ఆమోదించుకున్నారని ఆరోపించారు. గీతం అవినీతికి, దోపిడీకి వ్యతిరేకంగా వైసీపీ కార్పొరేటర్లు అడిగితే కూటమి నాయకులు దాడులు చేశారని ఆరోపించారు. కౌన్సిల్ జరుగుతున్న సమయంలో పోలీసులకు అనుమతి ఇచ్చారని, మీడియాని లోపలికి రాకుండా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు.

ఐదు వేల కోట్ల విలువైన దాదాపు 55 ఎకరాలను చంద్రబాబు ఫ్యామిలీ దోచుకుందని విమర్శించారు. ఈ దోపిడీకి బీజేపీ, జనసేన పార్టీలు సహకరిస్తున్నాయని ధ్వజమెత్తారు. కౌన్సిల్లో ఆమోదం తెలిపినా చట్టబద్ధం కాదన్నారు. దీనిపై జగన్‌తో చర్చించి పూర్తిస్థాయి కార్యచరణ ప్రకటిస్తామన్నారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×