E-Paper
Advertisement

లోకేశ్, పవన్‌లపై గుడివాడ అమర్నాథ్ ఫైర్.. ‘కుక్కను కనకపు సింహాసనంపై కూర్చోబెడితే’..

లోకేశ్, పవన్‌లపై గుడివాడ అమర్నాథ్ ఫైర్.. ‘కుక్కను కనకపు సింహాసనంపై కూర్చోబెడితే’..
Advertisement

Gudivada Amarnath: విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ పై వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. చనిపోయింది 8 మందే కదా అన్నట్లు మంత్రి లోకేశ్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పరామర్శ అనంతరం లోకేష్, పవన్ కళ్యాణ్ మాటలు చూసి ఉత్తరాంధ్ర ప్రజలు ముక్కున వేలు వేసుకున్నారన్ని విమర్శించారు. మరోవైపు కార్మిక సంఘం నేతలతో లోకేశ్ కోపంగా మాట్లాడటాన్ని.. అమర్నాథ్ తప్పుబట్టారు. పాలన చేయడం చేతకానప్పుడే ఇలాంటి ఫ్రస్టేషన్ వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లోకేశ్ ఒక ఈవీఎం బ్యాచ్ అని, ఆయనది ఈవీఎం టీమ్ అంటూ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. లోకేశ్ ఆయన తండ్రి చంద్రబాబు.. ఎన్నికల్లో ఏ విధంగా గెలిచారో ప్రజలు చర్చించుకుంటున్నారని అన్నారు. కుక్కను కనకపు సింహాసనం మీద కూర్చోబెడితే ఎలా ఉంటుందో లోకేష్ పరిస్థితి చూస్తే అలానే ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలకు డబ్బు లేకపోవచ్చు గానీ ఆత్మగౌరవం ఉందంటూ అమర్నాథ్ పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ఆయన ఆరోపించారు.

Advertisement

స్లీట్ ప్లాంట్ లో 6 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని అమర్నాథ్ ఆరోపించారు. వీఆర్ఎస్ పేరుతో మరో 2000 మంది ఉద్యోగాలను కోల్పోయారని పేర్కొన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వైసీపీ నేత విమర్శించారు. నిన్నటి ప్రమాదానికి జగన్ కు ఏంటి సంబంధమని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దు అంటూ ఏనాడైన ప్రధాని మోదీని కోరారా? అంటూ పవన్ ను ప్రశ్నించారు. కానీ వైఎస్ జగన్ మాత్రం తన హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాశారని గుర్తుచేశారు. అసెంబ్లీలోనూ తీర్మానం చేశారని స్పష్టం చేశారు.

Also Read: బీజేపీ ‘స్వచ్ఛ పాఠశాల’.. బండి సంజయ్ వినూత్న కార్యక్రమం.. గిన్నీస్ రికార్డుపై కన్ను!

Advertisement

అంతేకాకుండా ప్రధాని మోదీ విశాఖ వచ్చిన సందర్భంలో బహిరంగ సభలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని జగన్ కోరారని అమర్నాథ్ అన్నారు. కేంద్ర మంత్రి కుమార స్వామి స్వయంగా జగన్ వలనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని చెప్పారని గుర్తుచేశారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ బాధితులకు రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. ప్రతీ బాధిత కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని కోరారు. అలాగే బాధిత కుటుంబాల పునరావాసానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు.

Also Read: నాటి బతుకమ్మ చీరలతో.. అడవి పందులు తోలేవారు.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ సెటైర్లు

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×