E-Paper
Advertisement

East Godavari News: కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో పెళ్లికొడుకు పరార్‌, అసలు మేటరేంటి?

East Godavari News: కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో పెళ్లికొడుకు పరార్‌, అసలు మేటరేంటి?
Advertisement

East Godavari News: పెళ్లిని కొందరు  వ్యక్తులు ఎగతాళి చేస్తున్నారు. మొదటి వివాహం జరిగిన విషయాన్ని తెలియకుండా రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు ఓ పెళ్లికొడుకు. చివరకు మొదటి భార్య హెచ్చరికతో జంప్ అయ్యాడు పెళ్లి కొడుకు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగుచూసింది.

పెళ్లి అనేది రెండు మనసులు.. రెండు కుటుంబాల మధ్య ఏర్పడే ఒక పవిత్రమైన బంధం. సామాజిక, చట్టబద్ధమైన బంధం కూడా. కుటుంబ వ్యవస్థకు పునాది. పెళ్లి ద్వారా వ్యక్తులు జీవితాంతం కలిసి జీవించడానికి, ప్రేమను పంచుకోవడానికి బలమైన కుటుంబాన్ని నిర్మించుకోవడానికి ఒక అవకాశం. కానీ కొందరు పెళ్లి ఎగతాళి చేసే స్థాయికి చేరుకున్నారు.

Advertisement

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన సత్యనారాయణకు సోమవారం తెల్లవారుజామున పెళ్లి ఫిక్స్ చేశారు. గోపాలపురం మండలంలోని భీమోలు ప్రాంతానికి చెందిన ఓ యువతితో సోమవారం తెల్లవారుజామున వివాహం జరగనుంది. దీనికి సంబంధించి ఇరు కుటుంబాల పెద్దలు అన్నికార్యక్రమాలు దగ్గరుండి జరిపించారు.

ఆదివారం సాయంత్రం వరుడు సత్యనారాయణ కనిపించలేదంటూ అతడి బంధువులు వధువు తరఫువారికి కబురు చెప్పారు. దీంతో వధువు కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. వెంటనే దేవరపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి జరిగిన విషయాన్ని చెప్పారు. వధువు కుటుంబసభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగేశారు పోలీసులు. విచారణలో ఊహించని నిజాలు వెలుగులోకి వచ్చాయి.

Advertisement

ALSO READ: పులివెందులలో పోలింగ్.. జగన్ రూ100 కోట్లు, నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి

సత్యనారాయణకు ఐదేళ్ల కిందట భర్త చనిపోయిన మహిళతో వివాహం జరిగినట్టు తేలింది.  అంతేకాదు ఆ మహిళ కూతురికి సత్యనారాయణ దగ్గరుండి మరీ వివాహం జరిపించాడు. భర్తకు రెండో పెళ్లి విషయం తెలుసుకున్న మొదటి భార్య.. తన భర్త సత్యనారాయణకు ఫోన్ చేసింది.

తనతో ఇన్నాళ్లు కాపురం చేసి రెండో పెళ్లి చేసుకుంటే కేసు పెడతానని హెచ్చరించింది. అదే జరిగితే పోలీసులు తనను అరెస్టు చేయడం ఖాయమని భావించాడు. రెండో పెళ్లి చేసుకునే బదులు, మొదటి భార్యతో ఉండడమే బెటరని నిర్ణయానికి వచ్చాడు.

దీంతో ఎవరికి చెప్పకుండా సత్యనారాయణ మొదటి భార్యతో పారిపోయాడని ఆరోపిస్తున్నారు వధువు బంధువులు. పెళ్లి కుమార్తెకు న్యాయం జరిగేలా చూస్తామని అంటున్నారు పోలీసులు. మరి ఈ కేసుకు పోలీసులు ఎలాంటి ముగింపు ఇస్తారో చూడాలి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×