// // Sachivalaya Employees: సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. స్పౌజ్ కేటగిరి బదిలీలకు అనుమతి.. మార్గదర్శకాలు జారీ -->
E-Paper
Advertisement

Sachivalaya Employees: సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. స్పౌజ్ కేటగిరి బదిలీలకు అనుమతి.. మార్గదర్శకాలు జారీ

Sachivalaya Employees: సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. స్పౌజ్ కేటగిరి బదిలీలకు అనుమతి.. మార్గదర్శకాలు జారీ
Advertisement

Sachivalaya Employees: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయ ఉద్యోగుల అంతర్ జిల్లా బదిలీలపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పౌజ్ గ్రౌండ్స్ పై ఇంటర్ డిస్ట్రిక్ ట్రాన్స్ ఫర్ కు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. డిసిప్లినరీ, ఏసీబీ కేసులు ఉన్నవారికి ట్రాన్స్ ఫర్లకు అనర్హులని పేర్కొంది. క్లియర్ వేకెన్సీ ఉన్నప్పుడు మాత్రమే ట్రాన్స్ ఫర్ చేస్తామని ప్రకటించింది.

మార్గదర్శకాలు జారీ

బదిలీలు పూర్తిగా రిక్వెస్ట్ బేసిస్‌ మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి. ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా దరఖాస్తులు సమర్పించాలి.
ట్రాన్స్‌ఫర్ యూనిట్: నియామక యూనిట్ అయిన పాత జిల్లాలే ట్రాన్స్‌ఫర్ యూనిట్లగా పరిగణనలోకి తీసుకుంటారు.
సంబంధిత హెచ్ఓడీలు తమ డిజిగ్నేషన్‌లకు సంబంధించిన ఖాళీల జాబితాను ప్రకటించాలి.
ఎంపిక ప్రాంతాలు: ఉద్యోగులు తమకు కావాల్సిన మండలాలు/అర్బన్ లోకల్ బాడీస్ లను ఎంపిక చేసుకోవచ్చు.
డిసిప్లినరీ కేసులు ఉన్నవారికి ఈ బదిలీలకు అవకాశం లేదు. ఏసీబీ/విజిలెన్స్ కేసులు ఉన్నవారి అభ్యర్థనలు పరిగణనలోకి తీసుకోరు.
నో-డ్యూస్ సర్టిఫికేట్: MPDO/మున్సిపల్ కమిషనర్ నుంచి నో డ్యూస్ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకోవాలి.

ఏ ఉద్యోగులు అర్హులంటే?

Advertisement

స్పౌజ్ బదిలీల అభ్యర్థనను కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే పరిగణిస్తారు.
రాష్ట్ర ప్రభుత్వం/పీఎస్.యూ/రాష్ట్ర యూనివర్శిటీలు/మున్సిపాలిటీలు/కోఆపరేటివ్ సంస్థలు/ఎయిడెడ్ సంస్థలు
సెంట్రల్ గవర్నమెంట్/సెంట్రల్ యూనివర్శిటీలు/సెంట్రల్ సంస్థలు
భర్త/భార్యలో ఒకరు ప్రైవేట్ ఉద్యోగి అయితే అర్హులు కాదు.

సమర్పించాల్సిన పత్రాలు

1. మ్యారేజ్ సర్టిఫికెట్
2. భర్త/భార్య ఉద్యోగ ధ్రువీకరణ ఐడీ

అంతర్ జిల్లా బదిలీ నిబంధనలు

Advertisement

ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే బదిలీలు చేపడతారు. బదిలీ అయిన ఉద్యోగికి ఆ జిల్లాలో చివరి ర్యాంక్ కేటాయిస్తారు. అభ్యర్థులను మెరిట్ ర్యాంక్ ఆధారంగా సీరియల్‌గా అమరుస్తారు. సర్వీస్ సీనియారిటీ, పుట్టిన తేదీ వివరాల మేరకు కేటాయిస్తారు.

బదిలీ ప్రక్రియ

ఉద్యోగులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ఎంపీడీవో/కమిషనర్ సర్టిఫై చేయాలి. తాత్కాలిక సీనియారిటీ లిస్ట్ పోర్టల్‌లో విడుదల చేస్తారు. దీనిపై అభ్యంతరాలు ఆన్‌లైన్‌లో తెలియజేయవచ్చు. హెచ్.వోడీలు అభ్యంతరాలు పరిశీలించి తుది లిస్ట్ పోర్టల్‌లో విడుదల చేస్తారు. జిల్లాల మధ్య బదిలీలు సంబంధిత శాఖ సెక్రటరీలు జారీ చేస్తారు.

Also Read: Botsa Daughter: ఏపీ రాజకీయాల్లోకి వారసుల ఎంట్రీ.. వచ్చే ఎన్నికల్లో బొత్స కుమార్తె పోటీ?

పోస్టింగ్ కేటాయింపు

  • ముందుగా పోర్టల్‌లో మండల/ULB కేటాయింపు ఉంటుంది.
  • తరువాత కౌన్సెలింగ్ ద్వారా సచివాలయం కేటాయిస్తారు.
  • కలెక్టర్లు/ఆర్డీఎంఏ అపాయింటింగ్ అథారిటీల ద్వారా పోస్టింగ్ కేటియిస్తారు.
  • ఈ మొత్తం బదిలీ ప్రక్రియను 30-11-2025 లోపు పూర్తి చేయాలి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×