// // Good News For Passengers: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై వాట్సాప్‌లో టికెట్ బుకింగ్ -->
E-Paper
Advertisement

Good News For Passengers: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై వాట్సాప్‌లో టికెట్ బుకింగ్, అదెలా?

Good News For Passengers: ఆర్టీసీ ప్రయాణికులకు  శుభవార్త.. ఇకపై వాట్సాప్‌లో టికెట్ బుకింగ్, అదెలా?
Advertisement

Good News For Passengers: టెక్ యుగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అడుగులు వేయాలి. లేకుంటే అన్నివిధాలుగా వెనుకబడిపోతాం. సాంకేతికను వేగంగా అందిపుచ్చుకునే ఏపీ ప్రభుత్వం, సామాన్యుడికి చేరువయ్యేందుకు మరో అడుగు ముందుకేసింది. ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వాట్సాప్ ద్వారా బస్సు టికెట్లను బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త

Advertisement

బస్సు టికెట్లు బుకింగ్ చేసుకోవాలంటే ఒకప్పుడు రకరకాల యాప్‌లను ఆశ్రయించాల్సి వచ్చేది. రెడ్ బస్, అభిబస్ లేకుంటే ట్రావెల్ ఏజెంట్లపై చాలామంది ఆధారపడాల్సి వచ్చేసింది. ఇకపై అలాంటి శ్రమ పడాల్సిన పనిలేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. కేవలం నిమిషంలో బస్సు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అదెలా అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.

ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణీకులకు తీపి కబురు చెప్పింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు టికెట్ల కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. కేవలం మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌‌లోని వాట్సాప్ ద్వారా సులభంగా టికెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

Advertisement

వాట్సాప్‌లో టికెట్ బుకింగ్, అదెలా?

ఏపీలో కూటమి ప్రభుత్వం మన మిత్ర వాట్సాప్ ద్వారా రకరకాల సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా వివిధ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు దూరప్రాంతాలకు వెళ్లేందుకు బస్సు టికెట్లు అందులో ఎంచక్కా బుక్ చేసుకోవచ్చు.

అందుకోసం ప్రయాణీకులు 9552300009 నెంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి.  వాట్సాప్‌లో హాయ్ అంటూ మెసేజ్ పంపిస్తే చాలు. వివిధ సేవల జాబితా మీ కళ్ల ముందు కనిపిస్తుంది.ఆ తర్వాత నచ్చిన సేవలను ఎంపిక చేసుకోవాలి. ఏపీఎస్ ఆర్టీసీ సర్వీసు ఎంచుకుంటే వాటిని సంబంధించి సర్వీసులు కనిపిస్తాయి.

ALSO READ: IPS పీవీ సునీల్ కుమార్ ఆసక్తికర పోస్టు, తాను ఓకే.. ఆయన మాటేంటి?

ఆ తర్వాత టికెట్ బుకింగ్ ఆప్షన్ ఎంపిక చేయాలి. ఆ తర్వాత ప్రయాణ వివరాలు, ప్రయాణికుల సమాచారం ఎంటర్ చేయాలి. అది పూర్తి కాగానే ఆన్‌లైన్ పేమెంట్ విధానాన్ని ఎంచుకుని డబ్బులు చెల్లించవచ్చు. ఈ ప్రాసెస్ కాగానే మీ టికెట్ నేరుగా వాట్సాప్ లోకి వచ్చేస్తోంది.

ఈ తరహా సర్వీసు వల్ల కాగితం వాడకం పూర్తిగా తగ్గుతుంది. సమయం వృథా కాదు. సీట్లు దొరకదేమోనన్న బెంగ కూడా ఉండదు. దీనిపై అవగాహన కోసం ప్రచారం మొదలుపెట్టింది. బస్టాండ్లు, ఎంక్వైరీ కౌంటర్లు, బస్సుల లోపల స్టిక్కర్లు, బ్యానర్ల ద్వారా ఈ వాట్సాప్ నెంబర్‌ను ప్రచారంలోకి తీసుకొస్తోంది. కేవలం తెలుగు మాత్రమే కాకుండా ఇంగ్లీష్ లోనూ అందుబాటులో ఉంటుంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×