E-Paper
Advertisement

Gold Seize : ప్రొద్దుటూరులో ఐటీ రైడ్స్.. ఎన్ని వందల కేజీల బంగారం సీజ్ చేశారంటే..?

Gold Seize : ప్రొద్దుటూరులో ఐటీ రైడ్స్.. ఎన్ని వందల కేజీల బంగారం సీజ్ చేశారంటే..?
Advertisement

Gold Seize : ఒకటి కాదు రెండు.. పది కాదు 20 కాదు ఏకంగా 300 కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. ఏపీలోని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఐటీ అధికారుల సోదాలు నిర్వహించారు. నాలుగు గోల్డ్ షాపుల్లో బిల్లులు లేని 300 కిలోల‌ బంగారాన్ని గుర్తించారు.ఆ గోల్డ్ ను సీజ్ చేశారు.

విజ‌య‌వాడ‌,తిరుప‌తికి చెందిన ఐటీ అధికారులు 4 రోజులుగా ప్రొద్దుటూరులో సోదాలు నిర్వహించారు. బుశెట్టి జువెలర్స్‌, డైమండ్స్ , గురురాఘ‌వేంద్ర, త‌ల్లం షాపుల్లో త‌నిఖీలు చేశారు. బిల్లులు లేని బంగారాన్ని సీజ్ చేశారు. ఆ బంగారాన్ని అట్టపెట్టెలు, సూట్‌కేసుల్లో భద్రపరిచారు. ఆ తర్వాత వాహనాల్లో తిరుపతికి తరలించారు. ఆయా షాపుల యజమానులు బిల్లులు లేకుండా భారీగా గోల్డ్ ను దిగుమతి చేసుకున్నారని ఐటీ అధికారులు నిర్ధారించారు.

Advertisement

బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు పెట్టింది పేరు. రెండో ముంబైగా ఖ్యాతి గాంచింది. ఇక్కడ 2 వేలకు పైగా బంగారం, స్వర్ణకారుల షాపులున్నాయి. ఈ ప్రాంతంలో ఎన్నోఏళ్లుగా గోల్డ్ వ్యాపార లావాదేవీలు భారీగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అక్రమంగా బంగారం దిగుమతి జరుగుతోంది. దీనిపై పక్కా సమాచారం అందుకున్న అధికారుల 4 దుకాణాల్లో సోదాలు చేపట్టారు.

ఐటీ అధికారుల సోదాలతో ప్రొద్దుటూరులోని బంగారం వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో చాలామంది వ్యారులు బంగారం దుకాణాలను మూసివేశారు. దసరా పండుగ సమయంలోనూ బంగారం దుకాణాలన్నీ మూత పడ్డాయి. దీంతో బంగారం కొనేందుకు షాపుల వద్దకు వచ్చిన వినియోగదారులు నిరాశగా వెనుదిరిగారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×