E-Paper
Advertisement

GITAM University: గీతం వర్సిటీపై వైసీపీ యుద్ధం.. ఎంపీ భరత్‌పై రూ. 5000 కోట్ల దోపిడీ ఆరోపణలు!

GITAM University: గీతం వర్సిటీపై వైసీపీ యుద్ధం.. ఎంపీ భరత్‌పై రూ. 5000 కోట్ల దోపిడీ ఆరోపణలు!
Advertisement

GITAM University: విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ భూములు , ఎంపీ భరత్ లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే రాజు, వాసుపల్లి గణేష్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

విద్యా సంస్థల ముసుగులో ఎంపీ భరత్ సుమారు రూ.5వేల కోట్లు దోచుకున్నారని కేకే రాజు ఆరోపించారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లపై దాడులు చేసి, అక్రమాలను క్రమబద్ధీకరించుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూములను కాపాడాలని గ్రీవెన్స్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ప్రజలను, ఎంపీ ఆదేశాల మేరకు అధికారులు అడ్డుకున్నారని ఆయన ధ్వజమెత్తారు.

Advertisement

కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ గీతం యూనివర్సిటీలో అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయని, చంద్రబాబు నాయుడు బంధువు అయినందున భరత్‌కు వేల కోట్ల విలువైన భూములను కట్టబెట్టారని విమర్శించారు. పోలీసులు కూటమి నాయకులకు బానిసల్లా వ్యవహరించకూడదని.. అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఈ భూ కబ్జాపై ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని ప్రకటించారు.

టీడీపీ నాయకుల అవినీతి బీజేపీ నేతలకు ఎందుకు కనిపించడం లేదని వాసుపల్లి గణేష్ కుమార్ ప్రశ్నించారు. ఎంపీ భరత్‌ను వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని.. భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గీతం భూములను స్వాధీనం చేసుకుంటామని ఆయన హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను కచ్చితంగా కూలదోస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Also Read: ట్రంప్ ఏం చెబితే మోదీ అది చేస్తారా? భువనగిరి ఎంపీ షాకింగ్ కామెంట్స్!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×