E-Paper
Advertisement

Garikipati: ఏపీని ‘తెలుగునాడు’గా మార్చాలి.. తెలుగుదనం రాష్ట్రం పేరులో లేదు, గరికిపాటి డిమాండ్

Garikipati: ఏపీని ‘తెలుగునాడు’గా మార్చాలి.. తెలుగుదనం రాష్ట్రం పేరులో లేదు, గరికిపాటి డిమాండ్
Advertisement

Garikipati: దేశంలో నగరాలు, రైల్వేస్టేషన్లు పేర్లు మారుతున్నాయి. ఈ జాబితాలోకి ఇప్పుడు రాష్ట్రాలు కూడా చేరిపోయాయా? కేరళను కేరళం అని మార్చిన మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌ను ‘తెలుగునాడు’‌గా మార్చాలనే డిమాండ్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు ప్రధానంగా డిమాండ్ చేశారు. అప్పుడే తెలుగువారికి గుర్తింపు వస్తుందని అంటున్నారు. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

తెలుగుదనం రాష్ట్రం పేరులో లేదు- గరికిపాటి 

Advertisement

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఇంకా బ్రిటీషర్లు పెట్టిన పేర్లు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత తొలుత పలు నగరాల పేర్లు మార్చారు. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో రైల్వేస్టేషన్లను మార్చారు. ఇప్పుడు రాష్ట్రాల పేర్లను మారుస్తున్నారు. ఎందుకంటే అవన్నీ బ్రిటీషర్స్ హయాంలో ఏర్పాటు చేసినవే. ఇక అసలు విషయానికి వద్దాం.

రీసెంట్‌గా కేరళ ప్రభుత్వం రిక్వెస్టు మేరకు కేరళ పేరును కేరళంగా మార్చారు కేంద్రంలోని ప్రధాని మోదీ. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ పేరుని ‘తెలుగునాడు’ మార్చాలని డిమాండ్ చేశారు ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు. అమలాపురంలో మూడో ప్రపంచస్థాయి తెలుగు మహాసభలు వైభవంగా సాగుతున్నాయి. రెండురోజులపాటు జరిగే మహాసభల ప్రాంగణానికి దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ పేరు పెట్టారు.

Advertisement

ఆంధ్రప్రదేశ్ పేరుని ‘తెలుగునాడు’గా మార్చాలని గరికిపాటి డిమాండ్

ఈ కార్యక్రమానికి ప్రవచనకర్తలు చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు జ్యోతి ప్రజ్వలనతో మహా సభలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా మాట్లాడిన గరికపాటి నరసింహారావు.. ఓ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. కేరళను ‘కేరళం’ అని మార్చినట్లే ఆంధ్రప్రదేశ్‌ని ‘తెలుగునాడు’‌గా మార్చాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు మాట కాదని తేల్చేశారు. మధ్య‌ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ ఎలానో ఆంధ్రప్రదేశ్ కూడా అంతేనని తేల్చి చెప్పేశారు. మన రాష్ట్రం పేరులో తెలుగుదనం లేదని మనసులోని మాటను బయటపెట్టారు. తమిళనాడు మాదిరిగా తెలుగునాడు అని మార్చేందుకు మాజీ సీఎం నందమూరి తారక రామారావు తీవ్ర ప్రయత్నాలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ALSO READ: మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల ఆర్థిక సాయం

ఆయన ఆశయాలకు అనుకూలంగా మార్చినప్పుడు తెలుగు ప్రజలకు జాతీయ అభిమానం ఉంటుందన్నారు. తమిళనాడు మాదిరిగా ఏపీని ‘తెలుగునాడు’గా మార్చాలన్నారు. కేరళ ప్రజలు కేవలం ఒక్క సున్న లేనందున మార్చాలని పట్టుబట్టారని అన్నారు. కేరళ వాళ్లకున్న పట్టుదల మనలో ఉంటే తెలుగు ప్రజల బతుకులు కూడా మారుతాయని చెప్పుకొచ్చారు.

గరికిపాటి చెప్పటినట్టుగా  దేశంలోని చాలా రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాల ఐడెంటిటీ ఉంది. కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే లేదు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడంతో తెలుగునాడు పేరు మార్చడం ఈజీ అవుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.  అందులోకే ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ కూడా ఉందని గుర్తు చేస్తున్నారు.  మొత్తానికి ఇప్పుడు కాకపోయినా రేపటి రోజైనా ‘తెలుగునాడు’గా పేరు మారడం ఖాయం.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×