E-Paper
Advertisement

Galla Madhavi Vs Mounika: అంబటి కూతురు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మాధవి ఆగ్రహం

Galla Madhavi Vs Mounika: అంబటి కూతురు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మాధవి ఆగ్రహం
Advertisement

Galla Madhavi Vs Mounika: వైసీపీ నేత అంబటి రాంబాబు కూతురు మౌనిక చేసిన ఆరోపణలపై తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి. చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పుకుండా ఎదురుదాడి చేయడంపై మండిపడ్డారు. తప్పుడు మాటలు మాట్లాడి చివరకు తప్పైపోయిందని చెప్పడం మొదటి నుంచి అలవాటుగా మారిందన్నారు.

అంబటి కూతురు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మాధవి ఆగ్రహం

Advertisement

గుంటూరులో మంగళవారం మధ్యాహ్నం మీడియా ముందుకొచ్చిన టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధరి, తనదైన శైలిలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు గురించి వైసీపీ నేతలు ఇష్టారీతిన మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్యకాలంలో అంబటి రాంబాబు మాదిరిగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరూ చేయలేదన్నారు.

ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలనే డిమాండ్‌తో ఆయన నివాసం వద్దకు వచ్చినట్లు తెలిపారు. మా అధినేత ఏనాడూ దాడులను ప్రోత్సహించరని కుండబద్దలు కొట్టేశారు. తాను పిలిస్తే పార్టీ కార్యకర్తలు రాలేదన్నారు. వైసీపీ నేతల మాటలకు రగిలిపోయి వచ్చారన్నారు. కల్తీ నెయ్యి అంశం నుంచి దృష్టి మళ్లించే క్రమంలో ఆ పార్టీ నేతలు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని దుయ్యబట్టారు.

Advertisement

అంబటివి ముమ్మాటికీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు-ఎమ్మెల్యే మాధవి

అదే క్రమంలో పవన్‌కళ్యాణ్ గురించి మీ నాన్న అంబటి మాట్లాడిన మాటలు గుర్తు లేదా? అంటూ ప్రశ్నలు రైజ్ చేశారు. తాను కులాల గురించి మాట్లాడనని తేల్చిచెప్పారు. పవన్‌కు కులంతో సంబంధం లేదని ఆయనకు కోట్లలో అభిమానులు ఉన్నారని గుర్తు చేశారు. పాత వాటిని రిపీట్ చేస్తే చాలానే ఉంటాయన్నారు.

అసెంబ్లీ, మీడియా సమావేశాల్లో అంబటి ఎలా మాట్లాడారో మీకు తెలుసా అంటూ ఎదురుదాడి మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్-తాను ఒకే కులం అని మాట్లాడారని అన్నారు. అసలు ఈ గొడవలో కులం ఎందుకు వచ్చిందన్నారు? రంగా పక్కన అంబటిని వర్ణించుకోవడం పెద్ద జోక్‌గా వర్ణించారు. అంబటి రాంబాబు అంటే చాలా సరదా మనిషి అని, సంక్రాంతి వస్తే ఆయన్ని గుర్తు చేసుకుంటారన్నారు అన్నారు ఎమ్మెల్యే గళ్లా మాధవి.

ALSO READ: త్రిసభ్య కమిటీ ముందుకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్

దేవుని దర్శనం చేసుకుని వెళ్తున్న అంబటిపై దాడి చేశారని ఆరోపించారు ఆయన కూతురు మౌనిక. నీచమైన భాష ఉపయోగించి మహిళ మాట్లాడడం మరింత దారుణంగా ఉందన్నారు.  మీకు ఏలాంటి నైతిక విలువ ఉందని క్షమాపణలు కోరుతున్నారని, అలాగని అంబటి వ్యాఖ్యలను తాను సమర్థించడం లేదన్నారు. అదే సమయంలో పవన్ పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారామె.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×