E-Paper
Advertisement

Gajuwaka Politics : వైసీపీలో ట్విస్ట్.. రాజీనామా తూచ్.. వెనక్కి తగ్గిన తండ్రీకొడుకులు..

Gajuwaka Politics : వైసీపీలో ట్విస్ట్.. రాజీనామా తూచ్.. వెనక్కి తగ్గిన తండ్రీకొడుకులు..
Advertisement

Gajuwaka Politics : విశాఖపట్నంలోని గాజువాక నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. సోమవారం వైసీపీకి ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవన్ రెడ్డి రాజీనామా చేయడం కలకలం రేపింది. ఇప్పుడు ఈ రాజీనామా విషయంలో ట్విస్ట్ ఏర్పడింది. తాను వైసీపీకి విధేయుడిగా ఉంటానంటూ ఎమ్మెల్యే నాగిరెడ్డి స్పష్టం చేయడంతో రాజకీయం కొత్త మలుపు తిరిగింది.

గాజువాక నియోజకవర్గం సమన్వయకర్తగా సోమవారం రామచంద్రరావును వైసీపీ నియమించింది. తన కుమారుడిని తప్పించి.. ఓ కార్పొరేటర్‌కు అవకాశం ఇవ్వడంపై నాగిరెడ్డి అలిగారని ప్రచారం జరిగింది. ఆయన తనయుడు దేవన్ రెడ్డి సోమవారం వైసీపీకి రాజీనామా చేశారు. అయితే ఎమ్మెల్యే నాగిరెడ్డి, ఆయన కుమారుడు దేవన్‌రెడ్డి.. వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డిని కలిశారు. చర్చల తర్వాత రాజీనామా విషయంలో వెనక్కు తగ్గారు.

Advertisement

ఒక్కరోజు వ్యవధిలో ఎమ్మెల్యే నాగిరెడ్డి స్వరం మారింది. తాము వైసీపీలోనే ఉంటామని తండ్రీకొడుకులు స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయాలను గౌరవిస్తామని వైవీ సుబ్బారెడ్డిని కలిసి చెప్పారు. ప్రస్తుతం గాజువాక వైసీపీలో ముసలం ఇలా సద్దుమణిగింది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×