E-Paper
Advertisement

Teacher MLC elections: చంద్రబాబు సర్కార్‌కు భారీ షాక్.. టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్‌టీయూ అభ్యర్థి విజయం..

Teacher MLC elections: చంద్రబాబు సర్కార్‌కు భారీ షాక్.. టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్‌టీయూ అభ్యర్థి విజయం..
Advertisement

Teacher MLC elections: ఏపీ రాష్ట్రంలోని కూటమి సర్కార్ కు భారీ షాక్ తగిలింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు ఎదురుదెబ్బ తగిలింది. భారీ విజయం సాధిస్తామనుకున్న చోట అనూహ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పరాజయం పొందింది. ఈ ఫలితం ఏపీ రాజకీయాల్లో పీఆర్‌టీయూ సంచలనం సృష్టించింది. అధికారంలో ఉన్న కూటమికి వ్యతిరేకంగా గవర్నమెంట్ టీచర్స్ తీర్పు ఇవ్వడం పొలిటికల్ గా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ALSO READ: Mega DSC: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. త్వరలోనే మెగా DSC ద్వారా 16,347 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..

Advertisement

ఏపీలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఒకటి టీచర్ ఎమ్మెల్సీ కాగా.. మరో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. తాజా ఎన్నికల ఫలితాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కీలకమైన ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఉపాధ్యాయులు సంచలన తీర్పు ఇచ్చారు. వైజాగ్- విజయనగరం- శ్రీకాకుళం టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకాల పాటి రఘువర్మ పోటీ చేయగా.. పీఆర్‌టీయూ తరఫున గాదె శ్రీనివాసులు పోటీ చేశారు.

ALSO READ: IOB Recruitment: డిగ్రీ అర్హతతో ఐఓబీలో 750 ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు.. ఇంకా ఆరు రోజులే మిత్రమా..!

Advertisement

సెకండ్ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో శ్రీనివాసులు విజయం..

అయితే ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గవర్నమెంట్ టీచర్ కూటమి సర్కార్ కు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఫస్ట్ నుంచి పీఆర్టీయూ అభ్యర్థి అయిన గాదె శ్రీనివాసులు ఆధిపత్యం కొనసాగుతూనే వచ్చింది. ఎక్కడా కూడా టీడీపీ- జనసేన- బీజేపీ అభ్యర్థి పోటీలోకి రాలేదు. ఫైనల్ గా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు విజయం సాధించారు. సెకండ్ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఆయన గెలిపొందారు. శ్రీనివాసులు 10,068 ఓట్ల మ్యాజిక్ ఫిగర్‌ దాటడంతో ఆయన విజేతగా నిలిచారు. మరోవైపు, వెయ్యికి పైగా ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. విజేతను డిసైడ్ చేసే ప్రక్రియలో మొత్తం ఎనిమిది మందిని ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ 11 గంటల పాటు సాగింది.

ALSO READ: TGPSC Group-2,3 Results: గ్రూప్-2,3 ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చేసింది.. కొత్త నోటిఫికేషన్లు కూడా..?

కూటమి సర్కార్ కు బిగ్ షాక్..

విశాఖపట్నం- విజయనగరం- శ్రీకాకుళం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం పది మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఎనిమిది మందిని ఎలిమినేట్ చేసిన తర్వాత మూడో స్థానంలో నిలిచిన పీడీఎఫ్ అభ్యర్థి విజయగౌరి ఎలిమినేషన్ చేస్తుండగా గాదె శ్రీనివాసులు మ్యాజిక్ ఫిగర్ దాటారు. దీంతో అతడి విజయం ఖరారైంది. గాదె శ్రీనివాసులు విజయం సాధించడంతో ఆయన మద్దతుదారులు, పీఆర్‌టీయూ ఉపాధ్యాయులు సంబరాల్లో మునిగితేలారు. అయితే తాము బలపర్చిన రఘువర్మ ఓటమి పాలవ్వడంతో కూటమి సర్కార్ కు బిగ్ షాక్ తగిలింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×