E-Paper
Advertisement

Free Sand Effect: ఫ్రీ ఎఫెక్ట్.. అక్ర‌మ ఇసుక కోసం వెళ్లి న‌లుగురు గ‌ల్లంతు.!

Free Sand Effect: ఫ్రీ ఎఫెక్ట్.. అక్ర‌మ ఇసుక కోసం వెళ్లి న‌లుగురు గ‌ల్లంతు.!
Advertisement

ఏపీలోని అల్లూరి జిల్లా రంప‌చోడ‌వ‌రంలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్ర‌భుత్వం రాష్ట్రంలో త‌మ‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ వాగులు, వంక‌ల‌లో ఉచితంగా ఇసుక తీసుకు వెళ్ల‌వ‌చ్చ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని చాలా వాగుల్లో అక్ర‌మ ఇసుక త‌వ్వ‌కాలు జ‌రుగుతున్నాయి. లిమిట్ కు మించి ఇసుక‌ను తోడేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఏలేరు కాలువ‌లో ఇసుక త‌వ్వేందుకు వెళ్లిన న‌లుగురు వ్య‌క్తులు గ‌ల్లంతు అయ్యారు. ఈ ఘ‌ట‌న అడ్డతీగ‌ల మండలం బొంగ‌రాల‌పాడు గ్రామ సమీపంలోని ఏలేరు కాలువలో చోటు చేసుకుంది.

Also Read: తండ్రిని ప‌ట్టించుకోని కొడుకు.. రాసిచ్చిన ఆస్తిని తీసుకుని షాక్ ఇచ్చిన తండ్రి!

Advertisement

గ‌ల్లంతు అయిన న‌లుగురు ఏలేశ్వ‌రం మండ‌లం తూర్పు ల‌క్ష్మీపురం గ్రామానికి చెందిన‌వారిలో పోలీసులు గుర్తించారు. గ‌ల్లంతైన వారి కోసం అడ్డ‌తీగ‌ల పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ఇదిలా ఉంటే ఇలాంటి ఘ‌టన‌లు పునారావృతం కాకుండా చూసుకోవాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు. ఉచిత ఇసుక మంచిదే అయిన‌ప్ప‌టికీ అక్ర‌మార్కులు ఇసుకనంతా తోడేయ‌డం వ‌ల్ల గుంట‌లు ఏర్ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. వీటిలో సామాన్యులు సైతం గ‌ల్లంత‌య్యే ప్ర‌మాదం ఉంది. కాబ‌ట్టి ప్ర‌భుత్వం ఇసుక త‌వ్వ‌కాల‌పై నియంత్ర‌ణ పెట్టాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×