E-Paper
Advertisement

Kavuri Sambasiva Rao: మాజీ కేంద్ర మంత్రి ఆరోగ్యం విషమం.. స్టార్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స‌

Kavuri Sambasiva Rao: మాజీ కేంద్ర మంత్రి ఆరోగ్యం విషమం.. స్టార్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స‌
Advertisement

Kavuri Sambasiva Rao: కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు కావూరి సాంబశివరావు (82) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రాత్రి ఆయనకు శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న స్టార్ ఆసుపత్రికు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి అత్యవసర చికిత్స అందిస్తున్నారని సమాచారం.

ఆయన ఏలూరు మరియు మచిలీపట్నం నియోజకవర్గాల నుండి ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో ఆయన కేంద్ర జౌళి శాఖ (Textiles) మంత్రిగా పనిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన ప్రముఖ ఇంజనీరింగ్, నిర్మాణ సంస్థ ‘ప్రగతి కన్స్ట్రక్షన్స్’ స్థాపించి విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు.

Advertisement

కావూరి సాంబశివరావు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గతేడాది కూడా ఆయన వీల్‌చైర్‌పై పార్లమెంటుకు వచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఆయన ఆసుపత్రిలో చేరారన్న వార్త తెలియగానే ఉమ్మడి రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు ఆసుపత్రికి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. కావూరి త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, కార్యకర్తలు ప్రార్థిస్తున్నారు.

Read Also: Anurag Crash: సూసైడ్ అటెంప్ట్ చేసిన యూట్యూబర్ అనురాగ్ డోభాల్ పరిస్థితి విషమం..

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×