E-Paper
Advertisement

Tadapatla Ratnabai: మాజీ ఎంపీ తడపట్ల రత్నాబాయి కన్నుమూత.. గిరిజన రాజకీయాల్లో తీరని లోటు!

Tadapatla Ratnabai: మాజీ ఎంపీ తడపట్ల రత్నాబాయి కన్నుమూత.. గిరిజన రాజకీయాల్లో తీరని లోటు!
Advertisement

Tadapatla Ratnabai: కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ రాజ్యసభ సభ్యురాలు(ఎంపీ) తడపట్ల రత్నాబాయి (79) ఆదివారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, రంపచోడవరంలోని తన నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆదివారం రాత్రి ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆమె భర్త సత్యనారాయణ గతంలో పీసీసీ సభ్యులుగా పనిచేశారు. రత్నాబాయికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

రత్నాబాయి రాజకీయ ప్రస్థానం ఐదు దశాబ్దాలకు పైగా సాగింది. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ఆమె నిరంతరం కృషి చేశారు. 1972లో ఎల్లవరం (ప్రస్తుత రంపచోడవరం) నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. గిరిజన మహిళా నాయకురాలిగా కాంగ్రెస్ పార్టీలో ఆమె తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఆమె మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ, గిరిజన ప్రజల గొంతుకగా ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.

Advertisement

ఆమె రాజకీయ జీవితంలో అనేక కీలక పదవులను అధిష్టించారు. 2007లో గిరిజన సహకార సంస్థ (GCC) ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించి గిరిజనుల ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడ్డారు. ఆమె సేవలను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం 2009లో ఆమెను రాజ్యసభకు పంపింది. ఆ తర్వాత 2014లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యురాలిగా మూడు చట్టసభల్లోనూ ప్రాతినిధ్యం వహించిన అరుదైన గౌరవం ఆమెకు దక్కింది.

Read also: Basha Producer: శోకసంద్రంలో సినీ ఇండస్ట్రీ.. బ్లాక్ బస్టర్ సినిమా నిర్మాత కన్నుమూత…!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×