E-Paper
Advertisement

Dokka Manikya Varaprasad: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ మంత్రి..

Dokka Manikya Varaprasad: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ మంత్రి..
Advertisement

వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో డొక్కా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

వైసీపీపై అసంతృప్తితో పార్టీ సభ్యత్వానికి, గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు. ఆ రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపారు. వైసీపీకి రాజీనామా చేసి.. కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన టీడీపీలో చేరారు. ఆయనను పార్టీ అధినేత చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.

Advertisement

వైసీపీ అధిష్ఠానం డొక్కా మాణిక్య వరప్రసాద్ కు టికెట్ కేటాయించపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. అయితే టీడీపీ కూడా ఇప్పటికే పొత్తులో భాగంగా అన్ని అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించింది. దీంతో మాజీ మంత్రి డొక్కాకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ కేటాయించే అవకాశం దాదాపు అసాధ్యం అనే చెప్పుకోవచ్చు.

Also Read: టీడీపీకి షాక్.. వైసీపీ గూటికి యనమల కృష్ణుడు

Advertisement

టీడీపీ అధినేత చంద్రబాబు.. డొక్కా మాణిక్య వరప్రసాద్ కు ఎమ్మెల్సీ పదవి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. డొక్కాకు ఎమ్మెల్సీ పదవి ఫిక్స్ అంటూ గుంటూరులో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే టీడీపీ.. జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో డొక్కాకు ఏ పదవి కేటాయిస్తుందో వేచి చూడాల్సిందే.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×