E-Paper
Advertisement

Kadapa News: స్కూల్‌లో ఫుడ్ పాయిజన్.. పది మంది విద్యార్థులకు అస్వస్థత

Kadapa News: స్కూల్‌లో ఫుడ్ పాయిజన్.. పది మంది విద్యార్థులకు అస్వస్థత
Advertisement

Kadapa News: కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణ విషాదం చోటు చేసుకుంది. వసంతపేట మున్సిపల్ పాఠశాల విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో పది మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటుండగా.. ఒక్కసారిగా కడుపునొప్పి వాంతులతో బాధపడటం మొదలు పెట్టారు. పరిస్థితిని గమనించిన పాఠశాల హెడ్మాస్టర్ వెంటనే స్పందించారు. అస్వస్థతకు గురైన పది మంది విద్యార్థులను చికిత్స నిమిత్తం హుటాహుటిన ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.

Advertisement

విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై ప్రాథమిక విచారణ జరిగింది. దీనికి కారణం మధ్యాహ్న భోజనంలో పెట్టిన కందిపప్పే అని తేలింది. నిల్వ ఉంచిన కందిపప్పుకు పురుగులు పట్టకుండా నివారించడానికి పప్పు బస్తాలలో కొన్ని గుళికలు వేశారు. భోజనం వండే క్రమంలో ఈ గుళికలతో పాటే కందిపప్పును ఉడకబెట్టారు. ఈ కారణంగా పప్పు పూర్తిగా కలుషితమైంది. కలుషితమైన పప్పు తిన్న విద్యార్థులు వెంటనే అనారోగ్యానికి గురయ్యారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అజాగ్రత్తకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ALSO READ: Telangana Rising Global Summit: రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×